http://www.prajasakti.com/./mm/20200529//1590762705.Ambati-Rambabu.jpg

హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్డుకు వెళ్తాం: అంబటి రాంబాబు

ప్రజాశక్తి - అమరావతి బ్యూరో
ఎన్నికల కమిషనరు నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ వ్యవహారంలో హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్డుకు వెళ్లనున్నట్లు వైసిపి అధికారప్రతినిధి అంబటి రాంబాబు పేర్కొన్నారు. ప్రభుత్వం రాజ్యాంగబద్ధంగానే ఆర్డినెన్స్‌ జారీచేసిందన్నారు. హైకోర్టు తీర్పులో ఆర్డినెన్స్‌ రాజ్యాంగ విరుద్ధమని, దానికి అనుగుణంగా ఇచ్చిన జీఓలన్నింటినీ కూడా క్యాన్సిల్‌ చేస్తూ తీర్పునిచ్చిందన్నారు. ఇది ఒక పరిణామక్రమం. న్యాయవ్యవప్థపై మా పార్టీకి, ప్రభుత్వానికి అపారమైన గౌరవం ఉందన్నారు. ఇందులో ఎవ్వరూ సందేహపడాల్సిన అవసరం లేదన్నారు. రాజ్యాంగబద్ధంగానే ఆర్డినెన్స్‌ తేవడం, గవర్నర్‌ ఆమోదించడం దానికి అనుగుణంగా జీఓలు రావడం జరిగిందన్నారు. జీఓలకు అనుగుణంగా రమేష్‌కుమార్‌ అనివార్యంగా పదవీవిరమణ చేయాల్సి రావడం,. ఆ స్ధానంలో మాజీ న్యాయమూర్తి జస్టీస్‌ కనగరాజ్‌ బాధ్యతలు తీసుకోవడం జరిగిందన్నారు.