http://www.prajasakti.com/./mm/20200529//1590738563.surya.jpg

తమ్ముడి సినిమాలో సూర్య

        మలయాళంలో మంచి హిట్‌ కొట్టిన 'అయ్యప్పనుమ్‌ కోషియం' తమిళ రీమేక్‌లో నటులు సూర్య, కార్తీ కలిసి నటించనున్నట్టు తాజా సమాచారం. ఈ చిత్రం తమిళ రీమేక్‌ హక్కులను ఇటీవలే సూర్య కొనుగోలు చేశాడట. తమ్ముడితో కలిసి ఇందులో నటించాలని ఆయన ప్లాన్‌ చేస్తున్నాడని కోలీవుడ్‌లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఒకవేళ అదే నిజమైతే కనుక వీరి అభిమానులకు పండగే. కాగా ఈ మలయాళం చిత్రాన్ని తెలుగులో కూడా రీమేక్‌ చేయడానికి మరోపక్క సన్నాహాలు జరుగుతున్నాయి. నిర్మాత సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రం తెలుగు రీమేక్‌ హక్కులను సొంతం చేసుకున్నారు. బాలకష్ణ, రానాలతో దీనిని ఆయన రీమేక్‌ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం.