http://www.prajasakti.com/./mm/20200529//1590734453.Andhra-Pradesh-HC.jpg

హైకోర్టు తీర్పుపై సుప్రీంకు వెళ్లే యోచనలో సర్కార్‌!

         అమరావతి : హైకోర్టు తీర్పుపై సుప్రీం కోర్టుకు వెళ్లేందుకు ఎపి సర్కార్‌ ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. పూర్తి స్థాయిలో తీర్పు రాగానే సుప్రీం కోర్టుకు వెళ్లేందుకు సిద్ధమవుతోంది. తీర్పు తమకు ప్రతికూలంగా వస్తుందని ఊహించామని ప్రభత్వు పెద్దలు చెబుతున్నారు. ఇప్పటికే సీనియర్‌ న్యాయవాదులతో ప్రభత్వుం చర్యలు జరుపుతోంది. మాజీ ఎన్నిల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ను విధుల నుంచి తొలగిస్తూ ప్రభత్వుం జిఒలు జారీ చేసిన విషయం తెలిసిందే.. అయితే వీటిని సవాల్‌ చేస్తూ హైకోర్టులో 13 పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిని పలుమార్లు విచారించిన హైకోర్టు శుక్రవారం తీర్పును వెలువరించింది. ప్రభుత్వం తెచ్చిన జిఒలను కొట్టివేస్తూ, నిమ్మగడ్డను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. హైకోర్టు తీర్పు ప్రభుత్వానికి ప్రతికూలంగా రావడంతో దీనిపై సుప్రీం కోర్టుకు వెళ్లేందుకు సర్కార్‌ ఆలోచనలో ఉంది.
                            హైకోర్టు తీర్పు ప్రజాస్వామ్యానికి ఊపిరి పోసింది : వపన్‌ కల్యాణ్‌
        మాజీ ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ను విధుల నుంచి తొలగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జిఒలను హైకోర్టు కొట్టివేస్తూ, నిమ్మగడ్డను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని తీర్పు ఇవ్వడం పట్ల జనసేనాని పవన్‌ కల్యాణ్‌ స్పందించారు. హైకోర్టు తీర్పు ప్రజాస్వామ్యానికి ఊపిరి పోసిందని పేర్కొన్నారు. ఈ తీర్పుతో ప్రజాస్వామ్యంపై ప్రజలకు విశ్వాసం ఇనుమడింపచేసిందని తెలిపారు.
                    ఇలాంటి ప్రభుత్వాన్ని మొదటిసారిగా చూస్తున్నా : మహిళా న్యాయవాది
        న్యాయస్థానం తీర్పుపై స్పందించిన ఓ మహిళా సీనియర్‌ న్యాయవాది మాట్లాడుతూ.. రాజ్యాంగాన్ని, ఆర్డినెన్స్‌లను మార్చేసి వారికి అనుకూలంగా మార్చుకోవాలన్న ప్రభుత్వాన్ని చూడడం ఇదే మొదటిసారని అన్నారు. ఏదైనా చేయగలం, తాము చేసిందే కరెక్టు అనే ఉద్దేశంతో జగన్‌ ప్రభుత్వం ఎందుకుందో అర్థం కావడంలేదని అన్నారు. స్వతంత్య్ర ప్రతిపత్తిగల ఎలక్షన్‌ కమిషనర్‌ను మార్చివేసే ఆర్డినెన్సులు తీసుకువచ్చి, రాత్రికి రాత్రే ఏదో చేసేయాలని అనుకుంటోందని, అసలు రాష్ట్రాని ఏం చేద్దామని ప్రభుత్వం అనుకుంటుందో అర్థం కావడంలేదని ఆమె అన్నారు.