చైనాతో వివాదంపై ప్రజలకు చెప్పండి: రాహుల్ గాంధీ
న్యూఢిల్లీ: చైనాతో సరిహద్దు వివాదం రాజుకుందని రెండు రోజుల నుంచి వస్తున్న వార్తలపై కేంద్ర ప్రభుత్వం స్పందించాలని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ డిమాండ్ చేశారు. కరోనా సంక్షోభం దేశంలో నెలకొని ఉన్న పరిస్థితులు ఉన్నప్పటికీ సరిహద్దులో ఏం జరుగుతుందనే విషయాన్ని కేంద్ర ప్రభుత్వం ముందుకు వచ్చి ప్రజలకు చెప్పాలని ఆయన అన్నారు. ప్రజలకు చెప్పకుంటే లేనిపోని వూహాగానాలు, అస్పష్టత నెలకొంటోందని ఆయన పేర్కొన్నారు. ఏం జరుగుతుందో ప్రజలకు తెలియజేయడం ప్రభుత్వం కనీస బాధ్యతని, రెండురోజులైనా నోరు మెదపకపోవడం సరైందికాదని రాహుల్ అన్నారు.