http://www.prajasakti.com/./mm/20200529//1590717382.samantha.jpg

తల్లి కాబోతున్న సమంత..!

        'ఏమాయ చేశావే'తో ప్రేక్షకులనే కాకుండా అందులో హీరోగా నటించిన నాగ చైతన్యను కూడా మాయ చేసిన బ్యూటీ సమంత గురించి ఓ ప్రచారం సోషల్‌ మీడియాలో హాట్‌ టాపిక్‌గా మారింది. 'ఏమాయ చేశావే'తో తెలుగు సినీ పరిశ్రమకు పరిచయమైన ఈ భామ అతి తక్కువ కాలంలోనే ఊహించని స్థాయికి ఎదిగింది. తాను నటించిన సినిమాల్లో ఎక్కువ విజయాలను అందుకొని టాప్‌ హీరోయిన్‌గా నిలదొక్కుకుంది. తెలుగులోనే కాకుండా తమిళంలో కూడా అనేక విజయాలు సొంతం చేసుకుంది. 'ఓ బేబీ' హిట్‌ మూవీ తరువాత సామ్‌ నటించిన 'జాను' మూవీ ఫ్లాప్‌ అయ్యింది. ఆ తరువాత ఒక్క సినిమాకు కూడా సంతకం చేయలేదు. ప్రస్తుతం 'ద ఫ్యామిలీ మ్యాన్‌ 2' అనే తెలుగు వెబ్‌ సిరీస్‌లో నటిస్తోంది. అందరు సెలబ్రిటీలలాగే సామ్‌ కూడా కరోనా లాక్‌డౌన్‌ను ఫ్యామిలీతో ఎంజారు చేస్తోంది. ఈ నేపథ్యంలో నాగ్‌ కుటుంబానికి సంబంధించిన ఓ విషయం సోషల్‌ మీడియాలో బాగా ప్రచారం జరుగుతోంది. చాలా రోజులుగా సమంత తలి కాబోతోందనే వార్తలు ప్రచారం అవుతున్నాయి. వార్తలను సమంత ఎంత ఖండించినా ఆగడం లేదు. మరింత ఎక్కువయ్యాయి. దీనికి కారణం కూడా లేకపోలేదు. సమంత తాజాగా ట్విటర్‌లో పోస్టు చేసిన ఓ ఫొటోనే అని అంటున్నారు. ఆ ఫొటోలో సమంత విక్టర్‌ సింబల్‌ చూపిస్తూ ఉంది. ఈ ఫొటోకు క్యాప్షన్‌ ఇవ్వకపోవడంతో ఎవరికి తోచింది వారు కామెంట్లు చేస్తున్నారు. కొందరేమో సమంత తల్లికాబోతోందని పరోక్షంగా చెప్పిందని అంటుంటే.. మరికొందరేమో ఆర్‌ఆర్‌ఆర్‌ తరువాత ఎన్‌టిఆర్‌, త్రివిక్రమ్‌ సినిమాలో నటించబోతోందని, అందుకే ఇలా పెట్టిందని అంటున్నారు. నిజంగానే సమంత తల్లికాబోతుంటే మాత్రం నాగ్‌ కుటుంబంలోకి మరో బుల్లి హీరో వస్తున్నట్టే.. దీనిపై నాగ చైతన్య ఎలా స్పందిస్తాడో చూడాలి మరి.