https://www.sakshi.com/sites/default/files/styles/storypage_main/public/article_images/2020/05/29/quara.jpg?itok=2AvtK0Lv

క్వారంటైన్‌లో 23 లక్షల మంది

న్యూఢిల్లీ: ప్రస్తుతం దేశవ్యాప్తంగా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో, ఆయా ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన క్వారంటైన్‌ కేంద్రాల్లో సుమారు 23 లక్షల మంది ఉన్నారని కేంద్రం ప్రకటించింది. దేశంలోపల ప్రయాణాలు చేసినవారు, విదేశాల నుంచి వచ్చినవారు, ఇతరులు అందులో ఉన్నారని పేర్కొంది. మహారాష్ట్రలో అత్యధికంగా 6.02 లక్షల మంది,గుజరాత్‌లో 4.42 లక్షల మంది నిర్బంధంలో ఉన్నారన్నారు. బుధవారం వరకు 91 లక్షల మంది వలస కూలీలను రైళ్లు, బస్సుల్లో స్వస్థలాలకు పంపించినట్లు కేంద్రం తెలిపింది. అత్యధికంగా వలస కూలీలు స్వస్థలాలకు వెళ్లిన రాష్ట్రం ఉత్తర ప్రదేశ్‌. అక్కడ సుమారు 3.6 లక్షల మంది క్వారంటైన్‌లో ఉన్నారు. అయితే, వారిలో అత్యధికులు హోం క్వారంటైన్‌లోనే ఉన్నారు.