https://www.sakshi.com/sites/default/files/styles/storypage_main/public/article_images/2020/05/28/777.jpg?itok=DHk5rjEo

నేడు పారిశ్రామిక రంగంపై సదస్సు



సాక్షి, అమరావతి: ‘మన పాలన – మీ సూచన’ కార్యక్రమంలో భాగంగా గురు వారం పారిశ్రామిక రంగంపై సదస్సు నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా పారిశ్రామికవేత్తలు, లబ్ధిదారులతో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖాముఖి మాట్లాడతారు. లాక్‌డౌన్‌తో దెబ్బతిన్న పారిశ్రామిక రంగాన్ని తిరిగి గాడిన పెట్టడానికి ప్రవేశపెట్టిన, చేపట్టా ల్సిన కార్యక్రమాలపై సదస్సులో చర్చి స్తారు. గత ఏడాది కాలంలో రాష్ట్రంలో కొత్తగా పెట్టుబడులను ఆకర్షించడానికి చేపట్టిన కార్యక్రమాలు, తిరిగి కొత్త పెట్టు బడులను ఆకర్షించ డంపై కూడా చర్చ జరుగుతుంది.

అదేవిధంగా ఇప్పటికే ఉన్న పరిశ్రమలకు భరోసా కల్పించే విధంగా తీసుకున్న నిర్ణయాలు, వలస కూలీలను స్థానిక పరిశ్రమల్లో వినియో గించుకునేందుకు వారికి కల్పించాల్సిన నైపుణ్యాభివృద్ధి వంటి అంశాలపై చర్చిస్తారు. త్వరలో తీసుకురానున్న నూతన పారిశ్రామిక విధానంపై పారిశ్రా మిక సంఘాలు, పారిశ్రామికవేత్తల సూచనలు, సలహాలు తీసుకుంటారు. ఈ సదస్సుకు పరిశ్ర మలు, పెట్టుబ డులు, మౌలిక వసతుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల వలవన్‌ సమన్వయకర్తగా వ్యవహరి స్తారు. పరిశ్ర మల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌ రెడ్డితోపాటు పరిశ్రమలు, రహదారులు, వాటర్‌గ్రిడ్, మారిటైమ్‌ బోర్డు, స్కిల్‌ డెవలప్‌మెంట్, హౌసింగ్, ఫైబర్‌ నెట్‌ వంటి వివిధ శాఖలకు చెందిన అధికారులు సదస్సుకు హాజరవుతారు.