https://www.sakshi.com/sites/default/files/styles/storypage_main/public/article_images/2020/05/28/temparatures.jpg?itok=DV2u3dIz

రాష్ట్రంలో పెరిగిన వడగాడ్పులు



సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో వడగాడ్పుల తీవ్రత పెరిగింది. బుధవారం మంచిర్యాల జిల్లా జన్నారం, నిర్మల్‌ జిల్లా సోన్, జగిత్యాల జిల్లా మెట్‌పల్లి, మేడిపల్లి, రాయికల్, రాజన్నసిరిసిల్ల జిల్లా మల్లారం, ఆదిలాబాద్‌ జిల్లాలోని బేల, ఆదిలాబాద్‌ కలెక్టరేట్, పెద్దపల్లి జిల్లా రామగుండం, శ్రీరాంపూర్, నిజామాబాద్‌ జిల్లా నందిపేట్, ఆర్మూర్‌లో అత్యధికంగా 46 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాగల రెండ్రోజులు గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణంగా 42 నుంచి 44 డిగ్రీలు నమోదవుతాయని, ఎండల తీవ్రత ఎక్కువగా ఉండటంతో మధ్యాహ్నం 1 నుంచి సాయంత్రం 5 వరకు అత్యవసరమైతే తప్ప బయటకు రాకూడదని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. అలాగే అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.