తెలంగాణలో కరోనాతో పోరాడి ఓడిన ఏడు రోజుల పాప
by admin, By Mirchi9మంగళవారం రాత్రి విడుదల చేసిన మెడికల్ బులెటిన్ ప్రకారం, 1,991 కేసులతో తెలంగాణలోని కరోనా కేసుల సంఖ్య 2,000 మార్కుకు తొమ్మిది కేసులు తక్కువగా ఉంది. నిన్నటి రోజున రాష్ట్రం తన అతి చిన్న వయసు ప్రాణనష్టాన్ని నమోదు చేసింది. ఏడు రోజుల వయస్సు చిన్నారి రాష్ట్రంలో కరోనా తో పోరాడి ఓడిన అతి పిన్న వయస్కురాలు.
కరోనా లక్షణాలు అభివృద్ధి చెందిన మూడు రోజుల తరువాత శిశువు మరణించింది. ఆ బేబీ హైదరాబాద్ లో ప్రభుత్వానికి చెందిన నీలౌఫర్ ఆసుపత్రిలో జన్మించింది. డిశ్చార్జ్ అయ్యాక ఆమె అనారోగ్యంతో ఉండడంతో కుత్బుల్లాపూర్ నుండి తిరిగి ఆసుపత్రికి తీసుకుని వచ్చారు ఆమె తల్లిదండ్రులు.
ప్రసవానికి ముందు ఆమె తల్లికి కరోనా టెస్టు చెయ్యగా నెగటివ్ వచ్చింది. అలాగే కుటుంబ సభ్యులలో ఎవరికీ లక్షణాలు లేవు. ఆసుపత్రిలో ఉన్న ఎవరో ఒకరి నుండి శిశువుకు వైరస్ సోకిందని వైద్యులు భావిస్తున్నారు. దీనితో ఆ పాప నివాసమున్న ఏరియా ని కంటైన్మెంట్ జోన్ గా ప్రకటించారు అధికారులు.
మరోవైపు… రాష్ట్రంలో వైరస్ వ్యాప్తి ఎక్కువగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే కనిపించింది. గత 15 -20 రోజులుగా జీహెచ్ఎంసీకే పరిమితమైన కరోనా మళ్లీ జిల్లాల్లో పంజా విసురుతోంది. ఇతర రాష్ట్రాల నుంచి వలస వచ్చిన వారి ద్వారా యాదాద్రి భువనగిరి, జగిత్యాల, మంచిర్యాల జిల్లాల్లో కోవిడ్ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి.