స్లిమ్ లుక్ లో మహానాడుకే హైలైట్ గా లోకేష్

by
https://www.mirchi9.com/wp-content/uploads/2020/05/Nara-Lokesh.jpg

ప్రతి ఏడాది ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఎంతో అట్టహాసంగా జరిగే తెలుగుదేశం పార్టీ మహానాడు. ఈసారి ఎటువంటి హంగూ ఆర్బాటం లేకుండా ఆన్ లైన్ లో జరుగుతుంది. చంద్రబాబు, లోకేష్, పార్టీ సీనియర్ నేతలు… జూమ్ యాప్ ద్వారా శ్రేణులతో మాట్లాడుతున్నారు. లాక్ డౌన్ కారణంగా కొద్ది మంది నేతలు మాత్రమే మంగళగిరి పార్టీ ఆఫీసుకు వచ్చారు.

మిగతా వారంతా తమ ఇళ్ల నుండి, ఆఫీసుల నుండే పాల్గొంటున్నారు. టీడీపీ జనరల్ సెక్రటరీ నారా లోకేష్ పార్టీ ఆఫీసులో హై లైట్ గా నిలిచారు. దాదాపుగా రెండు నెలల పాటు హైదరాబాద్ లోని తన ఇంటికే పరిమితమైన లోకేష్ పట్టుదలతో వెయిట్ తగ్గి స్లిమ్ గా మారారు… కొత్త లుక్ లో చినబాబు అందరినీ ఆకట్టుకున్నాడు.

ఈ రెండు నెలలలో లోకేష్ స్ట్రిక్ట్ గా డైట్ చేశారట. అలాగే ఒక ట్రైనర్ ని పెట్టుకుని భారీగా వెయిట్ తగ్గాడట. ఇప్పుడు మరింత కాన్ఫిడెంట్ గా, యాక్టీవ్ గా పార్టీ కార్యక్రమాలలో పాల్గొనడానికి సిద్ధం అవుతున్నడని సమాచారం. లోకేష్ ఏకంగా 20 కిలోల బరువు తగ్గినట్టు సమాచారం.

ఇక పోతే… లోకేష్ స్లిమ్ లుక్‌పై సోషల్ మీడియాలోనై టీడీపీ కార్యకర్తలు చర్చించుకుంటున్నారు. మా చోటా బాస్ స్లిమ్ లుక్ అంటూ ఫోటోలు షేర్ చేస్తున్నారు. ఈ ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మొత్తానికి లోకేష్ కొత్త లుక్ మహానాడు మొదటి రోజు టాక్ అఫ్ మహానాడుగా మారిపోయింది.