https://www.sakshi.com/sites/default/files/styles/storypage_main/public/article_images/2020/05/27/HEATT.jpg?itok=Mcs9v1jq

నిప్పులకొలిమి : మరో 24 గంటలు ఇదే తీరు..



సాక్షి, న్యూఢిల్లీ : ఉత్తరాది సహా దేశంలోని పలు ప్రాంతాల్లో కొనసాగుతున్న వడగాడ్పులు మరో 24 గంటలు కొనసాగుతాయని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) బుధవారం వెల్లడించింది. బంగాళాఖాతంలో నైరుతి రుతుపవనాలు మరింత బలపడినప్పటికీ మరో ఒకట్రెండు రోజులు అధిక ఉష్ణోగ్రతలు, వేడిగాలులు కొనసాగుతాయని తెలిపింది.

ఉత్తర, మధ్య భారత్‌లో పలు ప్రాంతాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతూ వేడిగాలులు వీస్తున్నాయని, కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రత 47 డిగ్రీల సెల్సియస్‌ దాటుతోందని ఐఎండీ పేర్కొంది. ప్రస్తుత వడగాడ్పులు, అత్యధిక ఉష్ణోగ్రతలు రానున్న 24 గంటల్లో కొనసాగే అవకాశం ఉందని వెల్లడించింది. రానున్న 24 గంటల్లో తెలంగాణ, మరాఠ్వాటా, ఒడిషా, జార్ఖండ్‌, బిహార్‌, పంజాబ్‌, కర్ణాటకల్లో వేడిగాలులు వీస్తాయని..విదర్భ, పశ్చిమ రాజస్ధాన్‌లో అత్యధిక ఉష్ణోగ్రతలతో వేడిగాలులు వీస్తాయని ఐఎండీ పేర్కొంది.

చదవండి : ఉత్తర భారతంలో రెడ్‌ అలర్ట్‌