https://www.sakshi.com/sites/default/files/styles/storypage_main/public/article_images/2020/05/27/ola.jpg?itok=qpeNAH7q

ఇదే సరియైన సమయం: ఓలా సీఈఓ

ముంబై: దేశంలో గమ్యస్థాలను చేర్చడంలో ప్రముఖ క్యాబ్‌ సేవల సంస్థ ఓలా క్యాబ్స్‌ ప్రయాణికుల మనసు చూరగొన్న విషయం తెలిసిందే. అదే విధంగా ఫైనాన్షియల్(ఆర్థిక సేవల)‌ రంగంలో కూడా  సరికొత్త బ్రాండ్‌ను క్రియేట్‌ చేయాలని ఓలా భావిస్తోంది. అందులో భాగంగానే ఓలా ఫైనాన్సియల్‌ సర్వీసిస్(ఆర్థిక సేవల)‌ను మరింత విస్తరించేందుకు సంస్థ వ్యూహాన్ని రచిస్తోంది. ఓలాలో ఫాల్కన్‌ ఎడ్జ్‌, వెంచర్‌ ఫండ్స్‌ అనే ఫైనాన్స్‌ సంస్థలు  రూ. 25కోట్ల డాలర్లు పెట్టుబడి అందించిందని సంస్థ తెలిపింది. దేశంలో పెట్టుబడులను అందించేందుకు ఆర్ధిక సంస్థలు విజయం సాధించలేకపోయావని ఓలా సహ వ్యవస్థాపకుడు, సీఈఓ బావిష్‌ అగర్వాల్‌ పేర్కొనారు.

ఆయన మాట్లుడుతూ.. ప్రస్తుతం ఉన్న ఆర్థిక సంస్థలపై ప్రజలకు నమ్మకం లేదని అన్నారు. ప్రజలకు మెరుగైన సేవలను అందించేందుకు ఇదే సరియైన సమయమని ఓలా ఉద్యోగులతో బావిష్‌ అగర్వాల్‌ తన ఆశయాన్ని పంచుకున్నారు. ఓలాను నమ్మి పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చిన మ్యాట్రిక్స్‌ ఎండీ విక్రమాదిత్యను బోర్డ్‌ మెంబర్‌గా ఓలా సంస్థ అవకాశం కల్పించింది. ఓలా మెరుగైన ఆర్థిక సేవలను అందించాలంటే దేశంలోని దిగ్గజ యాప్‌లైన గూగుల్‌ పే, ఫోన్‌ పే, అమెజాన్‌ పే లాంటి దిగ్గజ యాప్‌లను ఢీకొట్టాలని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. ఓలా ఆర్థిక సంస్థలో బోర్ట్‌ మెంబర్లుగా మాజీ వొడాఫోన్‌ సీఈఓ అరుణ్‌ సారిన్‌, హేమంత్‌ కొనసాగుతున్నారు. 

చదవండి: కరోనా కాటు, ఓలా ఉద్యోగులపై వేటు