https://www.sakshi.com/sites/default/files/styles/storypage_main/public/article_images/2020/05/27/Sachin.jpg?itok=RGami9iw

'ధోని ప్లాన్‌ మాకు కప్పును తెచ్చిపెట్టింది'

ముంబై : టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ ప్రపంచంలోనే అత్యుత్తమ కెప్టెన్లలో ఒకడన‍్న సంగతి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మ్యాచ్‌ ఇన్నింగ్స్‌ కీలక దశలో ఉన్న సమయాల్లో ధోని కెప్టెన్‌గా తీసుకున్న నిర్ణయాలు సఫలీకృతమయ్యాయనే చొప్పొచ్చు. ఇక ప్రత్యర్థి జట్టు ఆటగాళ్లపై వ్యూహాలు రచించడంలో మహీ దిట్ట అనడంలో ఎటువంటి సందేహం లేదు. కేవలం ప్రత్యర్థి ఆటగాళ్లపైనే కాకుండా ఐపీఎల్‌ సందర్భంగా టీమిండియా ఆటగాళ్లపై కూడా తన ప్రణాళికలు రచించి విజయవంతమయ్యాడనే చెప్పొచ్చు. ఐపీఎల్‌లో మూడుసార్లు చాంపియన్‌గా నిలిచిన చెన్నై సూపర్‌కింగ్స్‌ 2010లో జరిగిన ఐపీఎల్‌లో ఫైనల్‌ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌పై గెలిచి మొదటిసారి ఐపీఎల్‌ టైటిల్‌ను దక్కించుకుంది. (ఎటు నుంచి చూసినా బౌలర్లకే కష్టం)

ఆ మ్యాచ్‌లో మొదటగా బ్యాటింగ్ చేసిన చెన్నై 5 వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది. సూపర్‌ కింగ్స్‌ ఇన్నింగ్స్‌లో సురేశ్ రైనా హాఫ్ సెంచరీతో రాణించాడు. అయితే హిట్టర్లతో బలంగా కనిపించిన ముంబై ఆ లక్ష్యాన్ని అలవోకగా ఛేదించేస్తుందని అంతా ఊహించారు. అందులోనూ ఆ సీజన్‌లో మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ టెండూల్కర్‌ మంచి ఫామ్‌ కనబరుస్తున్నాడు. అయితే ఆ మ్యాచ్‌లో కెప్టెన్ ఎంఎస్ ధోనీ ఓ వ్యూహం ప్రకారం సచిన్‌ని బోల్తా కొట్టించి కప్ గెలిచామంటూ ఎడమచేతి వాటం స్పిన్నర్ షాదాబ్ జకాతి తాజాగా పేర్కొన్నాడు.

https://www.sakshi.com/sites/default/files/article_images/2020/05/27/Ipl-2010_1.jpg

జకాతి మాట్లాడుతూ.. ' ఫైనల్ మ్యాచ్‌లో నేను వేసిన మొదటి రెండు ఓవర్లలోనే 21 పరుగులు ఇచ్చాను. మూడో ఓవర్ బౌలింగ్ చేసే ముందు కెప్టెన్ ధోనీ నా వద్దకు వచ్చి.. ఎడమచేతి వాటం బ్యాట్స్‌మెన్ అభిషేక్ నాయర్ బ్యాటింగ్ చేస్తున్నాడు, నువ్వు మిడిల్ ఓవర్లలో బౌలింగ్ చేయాలంటూ నాతో చెప్పాడు. అయితే ధోనీ వ్యూహం ఏంటో నాకు అర్థం కాలేదు. నన్ను కుడిచేతి వాటం బ్యాట్స్‌మెన్ కోసం ఉంచాడని సచిన్ టెండూల్కర్ వికెట్ పడిన తర్వాత అర్ధమయింది. ముంబై జట్టులో కుడిచేతి వాటం బ్యాట్స్‌మెన్‌లు అయిన సచిన్ టెండూల్కర్, అంబటి రాయుడు, కీరన్ పొలార్డ్‌ల కోసం ఆ మ్యాచ్‌లో ధోనీ వారికోసం నన్ను కాసేపు బౌలింగ్‌ ఆపించాడు. ఆ ముగ్గురూ అప్పట్లో ఎడమచేతివాటం స్పిన్నర్లని ఎదుర్కోవడంలో కొంచెం బలహీనంగా కనిపించారు. అందుకే నన్ను మిడిల్ ఓవర్లలో బౌలింగ్ చేయించాడు మహీ. ఈ విషయం నాకు సచిన్ ఔట్ అయ్యాక కానీ తెలియరాలేదు. ధోనీ చేసిన ప్లాన్‌ చెన్నైకి మొదటిసారి కప్పును తెచ్చి పెట్టింది' అంటూ తెలిపాడు.
('అందుకే నిన్ను మిస్టర్‌ పర్‌ఫెక్ట్‌ అంటారు')

https://www.sakshi.com/sites/default/files/article_images/2020/05/27/Ipl-2010-1.jpg