కరోనా : కోలుకున్న సెంట్రల్ జైలు ఖైదీలు
ఢిల్లీ : కరోనా వైరస్ నుంచి రోహిణి జైలులోని 10 మంది ఖైదీలు, ఒక ఉద్యోగి బయటపడ్డారని మంగళవారం అధికారులు పేర్కొన్నారు. మే 15న హెడ్ వార్డెన్‌కి కరోనా సోకినట్లు నిర్ధారణ అయ్యింది. అయితే ఈయనకు జలుబు, దగ్గు లాంటి కరోనా లక్షణాలేవీ బయటపడలేదు. ఇది జైలులో కరోనా వ్యాప్తి అధికం కావడానికి మరొక కారణమని అధికారులు భావిస్తున్నారు. లక్షణాలు లేకపోవడంతో అందరితో మామూలుగానే ఉండటంతో కరోనా వేగంగా వ్యాప్తి చెందింది. (శ్రామిక రైళ్లలో అన్న పానీయాలు కరవు )
మే15న నిర్వహించిన కరోనా పరీక్షల్లో వైరస్ ఉన్నట్లు నిర్థారణ అయ్యింది. దీంతో అప్రమత్తమై జైలు అధికారులు మిగతా సిబ్బంది, ఖైదీలకు కరోనా పరీక్షలు నిర్వహించగా వారిలో 16 మంది ఖైదీలు, నలుగురు సిబ్బంది వైరస్ బారినపడినట్లు గుర్తించారు. దీంట్లో ఎక్కువగా జైలులోని కరోనా సోకిన ఖైదీతో బ్యారక్ పంచుకున్న వాళ్లే ఉన్నట్లు తేలింది. దీంతో వారందరినీ స్థానిక సోనిపేట్ ఆసుపత్రిలోని క్వారంటైన్ సెంటర్‌కు తరలించారు. మంగళవారం నిర్వహించిన పరీక్షల్లో పదిమంది ఖైదీలు, ఒక ఉద్యోగి కోలుకున్నారని జైళ్ల శాఖ డైరెక్టర్ జనరల్ సందీప్ గోయెల్ వెల్లడించారు. వీరికి మంగళవారం కరోనా నెగిటివ్ వచ్చినట్లు తెలిపారు. వైరస్ బారిన పడ్డ మిగతా ఖైదీలు కూడా తొందరగా కోలుకుంటారని ఆశాభావం వ్యక్తం చేశారు.
(6 రోజుల్లో కరోనాను జయించిన హెచ్‌ఐవీ పేషెంట్ )