షార్ట్ కవరింగా..? క్యాచ్ అప్ ర్యాలీయా..?
- మార్కెట్ భారీ లాభాలకు కారణాలేంటి..?
దేశీయ ఈక్విటీ ఇన్వెస్టర్లు స్టాక్ మార్కెట్ల పట్ల విశ్వాసాన్ని పెంపొందించికోవడంతో భారత సూచీలు మధ్యాహ్నం ట్రేడింగ్‌లో భారీగా ర్యాలీ చేసి ప్రపంచ మార్కెట్ల దృష్టిని ఆకర్షించాయి. అధిక వెయిటేజీ కలిగిన షేర్లతో పాటు బ్యాంకింగ్, ఫైనాన్స్ షేర్లకు అధిక డిమాండ్ లభించింది. అయితే మీడియా ఇండెక్స్ మాత్రం నష్టాల్లో ముగిసింది. మెటల్, ఐటీ స్టాక్ పలు దేశాలు లాక్‌డౌన్ సడలింపుతో ఆర్థిక వ్యవస్థ పునఃప్రారంభ నేపథ్యంలో ఐటీ, మెటల్ షేర్ల ర్యాలీ జరిపాయి.
‘‘బ్యాంకింగ్ రంగ షేర్లలో సంస్థాగత కొనుగోళ్లు జరిగాయి. ఎఫ్‌ఐఐలు 4-5 రోజుల క్రితం వరకు నికర అమ్మకందారులుగా ఉన్నారు. ఈ పరిస్థితి మారింది. ఇప్పుడు వారు షేర్ల ధరలను ఆకర్షణీయంగా భావిస్తూ కొనుగోళ్లకు సిద్ధమయ్యారు. ఇటీవల అమెరికాతో పాటు ఆసియా మార్కెట్లు సిర్థమైన ర్యాలీ చేస్తున్నాయి. ఇప్పుడు భారత్ మార్కెట్ ఆ ర్యాలీని అందుకుంది. మన మార్కెట్ కొన్ని రోజులు మరింత రాణించి అంతర్జాతీయ మార్కెట్ల ర్యాలీని మించిపోతుంది.’’ హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్ అధికారి ప్రతినిధి దీపక్ జశాని తెలిపారు.
మార్కెట్ ముగిసే సరికి నిఫ్టీ 286 పాయింట్ల లాభంతో 9,315 వద్ద, సెన్సెక్స్ 996 పాయింట్లు పెరిగి 31605 వద్ద స్థిరపడ్డాయి.యాక్సిస్ బ్యాంక్ అత్యధికంగా 14.50శాతం లాభపడి రూ.389.90 వద్ద స్థిరపడింది. అయితే ఐసీఐసీఐ బ్యాంక్, కోటక్ మహీంద్రా, బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్ షేర్లు 5శాతం నుంచి 9శాతం లాభపడ్డాయి. రంగాల వారీగా చూస్తే... నిఫ్టీ బ్యాంక్, ప్రైవేట్ బ్యాంక్ నిఫ్టీ ఇండెక్స్ 7.50శాతం లాభంతో ముగిశాయి. నిఫ్టీ ఫైనాన్సియల్ సర్వీసెస్ ఇండెక్స్ 6శాతం పడగా, నిఫ్టీ మీడియా(0.04శాతం), నిఫ్టీ ఫార్మా(0.20శాతం) నష్టాల్లో ముగిశాయి.
షార్ట్ కవరింగ్ ప్రభావమెంత..?
గురువారం(రేపు) ఎఫ్‌అండ్‌ఓలో ముగింపు నేపథ్యంలో ట్రేడర్లు షార్ట్ కవరింగ్‌తో పాటు ఎఫ్‌అండ్‌ఓ పోజిషన్లను రోలోవర్ చేసుకోవడం కూడా సూచీల భారీ ర్యాలీకి కారణమైనట్లు విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. ‘‘భారత్ స్టాక్ మార్కెట్ ప్రపంచ ఈక్విటీ మార్కెట్లను అందుకోనే ప్రయత్నం చేయడంతో పాటు ఎఫ్‌అండ్‌ఓ ముగింపు నేపథ్యంలో జరిగిన షార్ట్ కవరింగ్‌తో ఇండెక్స్‌లు భారీ లాభాలను ఆర్జించింది. కొద్దిగా రోజులుగా జరుగుతున్న ప్రపంచ ఈక్విటీ మార్కెట్ ర్యాలీలో భారత్ మార్కెట్ పాల్గోనలేదు. నేటితో మన మార్కెట్ కూడా గ్లోబల్ మార్కెట్‌తో కలిసి ర్యాలీ చేసేందుకు సిద్ధమైనట్లు సంకేతాలిచ్చింది. బ్యాంకింగ్, ఎన్‌బీఎఫ్‌సీ స్టాక్‌లో చాలా షార్ట్ పొజిషన్లు దాగి ఉన్నాయి.’’ మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్స్ సర్వీసెస్ అధికారి సిద్ధార్థ ఖేమ్కా తెలిపారు. నిఫ్టీ, బ్యాంక్ నిప్టీలు తమ మద్దతు స్థాయిల నుంచి బౌన్స్ బ్యాంక్ అయ్యాయి. రానున్న 2రోజుల్లో మార్కెట్లో పాజిటివ్ వాతావరణం నెలకొని ఉంటుందని ఆయన చెప్పుకొచ్చారు.
అంతర్జాతీయ మార్కెట్లలో సానుకూల సంకేతాలు మార్కెట్‌ను మరింత ఉత్సాహానిచ్చాయి. నిన్న రాత్రి అమెరికా ఈక్విటీ సూచీల్లో ప్రధానమైన డోజోన్స్ ఇండెక్స్ 2.17శాతం లాభపడి 25000 అతికొద్ది పాయింట్ల దూరంలో ముగిసింది. నేడు ఆసియా మార్కెట్లు 1శాతం లాభంతో ముగియగా, యూరప్ మార్కెట్లు 1శాతం లాభంతో ప్రారంభమయ్యాయి.