ఆర్జీవీకి అభినందనలు: బిగ్‌బీ
సంచలనల దర్శకుడు రామ్‌గోపాల్ వర్మపై బాలీవుడ్ బిగ్‌బీ అమితాబ్ బచ్చన్ ప్రశంసల జల్లు కురిపించారు. ఆర్జీవీ ‘కరోనా వైరస్’ ట్రైలర్‌ను బుధవారం ట్విటర్‌లో షేర్ చేస్తూ.. బహుశా దేశంలోనే మహమ్మారిపై వచ్చిన మొదటి చిత్రం ఇది అంటూ అభినందించారు. ‘ఎక్కడ తగ్గని సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ అందరికి ‘రాము’ కానీ.. నాకు మాత్రం సర్కార్. లాక్‌డౌన్ సమయంలో ఓ కుటుంబం ఎదుర్కొనే వివిధ పరిస్థితులపై.. లాక్‌డౌన్‌లోనే సినిమాను రూపొందించి సహజత్వాన్ని చూపించిన ఘనత ఆర్జీవీది. శీర్షిక: కరోనా వైరస్.. బహుశా వైరస్‌పై మొట్టమొదటిసారిగా వచ్చిన ఈ చిత్రం ట్రైలర్ ఇదిగో’ అంటూ ట్రైలర్‌ను పంచుకున్నారు. (ట్రైలర్‌తోనే బయపెడుతున్న వర్మ)
అందరికి భిన్నంగా ఆలోచించే ఆర్జీవీ కరోనా కారణంగా అమలవుతున్న లాక్‌డౌన్‌లో మహమ్మారిపై సినిమా తీసి అందరిని ఆశ్చర్య పరించారు. ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ నిన్న(మే 26)ను విడుదల చేసిన విషయం తెలిసిందే. 4 నిమిషాల నిడివి గల ‘‘కరోనా వైరస్’ ట్రేలర్‌ను ఆర్‌జీవీ ట్విటర్‌లో విడుదల చేస్తూ.. ఈ చిత్రం పూర్తిగా లాక్‌డౌన్‌లో నిర్మించింది. విపత్కర కాలంలో ప్రజల్లో నెలకొన్న భయాన్ని తెరపై చూపించాను. అంతేకానీ ఇది హర్రర్ చిత్రం కాదు’ అంటూ ఆర్జీవీ ట్వీట్ చేశారు. అదే విధంగా ‘‘లాక్‌డౌన్ సమయంలో తీసుకోవాల్సిన అన్ని భద్రత చర్యలు, జాగ్రత్తలు, ప్రభుత్వం మార్గాదర్శకాలను పాటిస్తూనే ఈ సినిమాను చీత్రికరించాము. ఇది నేను ఈశ్వర్, అల్లా , జీసస్‌ల సాక్షిగా ప్రమాణం చేసి చెబుతున్న’’ అంటూ ట్వీట్‌లో రాసుకొచ్చారు. కాగా, రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన ఈ చిత్రంలో శ్రీకాంత్ అయ్యంగర్, తదితరులు నటించారు. ఈ చిత్రానికి అగస్త్య మంజు దర్శకత్వం వహించగా, డీఎస్సార్ సంగీతమందించారు. ప్రస్తుతం కరోనా వైరస్ ట్రైలర్ యూట్యూబ్‌లో ట్రెండింగ్‌గా మారింది.