https://www.sakshi.com/sites/default/files/styles/storypage_main/public/article_images/2020/05/27/Brett-Lee.jpg?itok=QgL_kBwJ

ఎటు నుంచి చూసినా బౌలర్లకే కష్టం

మెల్‌బోర్న్‌ : లాక్‌డౌన్‌ తర్వాత క్రికెట్‌ టోర్నీ ఆరంభమైతే బౌలర్లు తిరిగి ఫామ్‌ను అందుకోవడం కొంచెం కష్టమేనంటూ ఆస్ట్రేలియా మాజీ ఫాస్ట్‌ బౌలర్‌ బ్రెట్‌ లీ పేర్కొన్నాడు. స్టార్‌స్పోర్ట్స్‌ నిర్వహించిన ఇంటర్య్వూలో పాల్గొన్న బ్రెట్‌ లీ పలు ఆసక్తికర విషయాలు పేర్కొన్నాడు. లాక్‌డౌన్‌ తర్వాత లయను అందుకోవడంలో బ్యాట్స్‌మెన్‌ లేక బౌలర్‌లో ఎవరు ఎక్కువ ఇబ్బందికి గురవుతారని బ్రెట్‌ లీని ప్రశ్నించారు.

దీనికి లీ స్పందిస్తూ..' కరోనా నేపథ్యంలో దాదాపు రెండు నెలలకు పైగా ఆటకు విరామం దొరికడంతో ప్రతీ ఆటగాడు ఇంటికే పరిమితమయ్యాడు. లాక్‌డౌన్‌ సమయంలో క్రికెటర్లు మొదలుకొని అథ్లెట్లు, ఇతర క్రీడలకు సంబంధించిన ఆటగాళ్లు ఇంట్లోనే ఉన్న గార్డెనింగ్‌ ఏరియాలు, ఇతర వనరులను వినియోగించుకొని తమ ప్రా‍క్టీస్‌ను మెరుగుపరుచుకుంటున్నారు. అదే క్రికెట్‌లో మాత్రం లాక్‌డౌన్‌ అనేది బ్యాట్స్‌మన్లు, బౌలర్లకు కొంచెం కష్టమే అని చెప్పొచ్చు. ఒక బౌలర్‌ తన పూర్తిస్థాయి ఫామ్‌ను అందుకోవడానికి 6 నుంచి 8 వారాలు కచ్చితంగా పడుతుందని చెప్పొచ్చు. ఒక వన్డే మ్యాచ్‌ లేక టెస్టు మ్యాచ్‌లో బ్యాట్స్‌మెన్‌ రిథమ్‌ను అందుకునేందుకు రెండు లేక మూడు మ్యాచ్‌లు చాలు.. కానీ బౌలర్‌కు అలా కాదు.. లయను అందుకోవాలంటే కచ్చితంగా 6 నుంచి 8 వారాల సమయం పడుతోంది. అందుకే నా దృష్టిలో ఒకవేళ ఆట ప్రారంభం తర్వాత బౌలర్‌కే కష్టం అని కచ్చితంగా చెప్తానంటూ' పేర్కొన్నాడు.('అందుకే నిన్ను మిస్టర్‌ పర్‌ఫెక్ట్‌ అంటారు')

బ్రెట్‌ లీ ఆసీస్‌ తరపున 76 టెస్టుల్లో 310, 221 వన్డేల్లో 380, 25 టెస్టుల్లో 28 వికెట్లు తీశాడు. కాగా సోమవారం విండీస్‌ ఆటగాళ్లలో కెప్టెన్‌ జాసన్‌ హోల్డర్‌ సహా కీమర్‌ రోచ్‌, షేన్‌ డౌరిచ్‌, షాయ్‌ హోప్‌లు కింగ్‌స్టన్‌ ఓవల్‌లోని బార్బడోస్‌ మైదానంలో తమ ప్రాక్టీస్‌ను కొనసాగించారు. అయితే ఇండియాలో కూడా ఆటగాళ్లు ఖాళీ మైదానాలు, స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌లో తమ ప్రాక్టీస్‌ చేసుకునేందుకు కేంద్రం అనుమతించింది.