పెన్షన్‌ల కోతపై హైకోర్ట్‌లో విచారణ
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ ఉద్యోగుల పెన్షన్‌లను 25 శాతం ప్రభుత్వం కోత విధించడంపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఇందుకు సంబంధించిన పిటిషన్‌ను పెన్షనర్స్ జేఏసీ నాయకులు లక్ష్మయ్య దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను హైకోర్టు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 3 లక్షల మంది పెన్షదారుల పెన్షన్ కట్ చేయొద్దని పిటిషనర్ తన పిటిషన్‌లో కోరారు. చదవండి: మటన్ వ్యాపారి ఇంట్లో 14 కరోనా కేసులు
మే నెల పెన్షన్ కట్ చెయ్యకుండా పూర్తి పెన్షన్ వేసేలా చూడాలని పిటిషనర్ తరపు న్యాయవాది చిక్కుడు ప్రభాకర్ హైకోర్టును కోరారు. దీనిపై అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ వాదనలు వినిపిస్తూ.. పెన్షనర్లపై ప్రభుత్వం పునరాలోచనలో ఉందని తెలిపారు. జూన్ 1 వరకు పూర్తి పెన్షన్ చెల్లించకపోతే అదే రోజు ఆదేశాలు జారీచేయనున్నట్లు హైకోర్టు తెలిపింది. తదుపరి విచారణను హైకోర్ట్ జూన్ 1కి వాయిదా వేసింది. చదవండి: అమాంతం ఎత్తేస్తున్నారు..