https://www.sakshi.com/sites/default/files/styles/storypage_main/public/article_images/2020/05/27/jr%20ntr.jpg?itok=p4R22xuc

అక్కడకు వెళ్లకూడదని నిర్ణయం..

హైదరాబాద్‌ : టీడీపీ వ్యవస్థాపకుడు నందమూరి తారకరామారావు జయంతి(మే 28) సందర్భంగా ప్రతి ఏడాది కుటుంబ సభ్యులు, అభిమానులు హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఆయనకు నివాళులర్పిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో ఆయన మనవళ్లు జూనియర్‌ ఎన్టీఆర్‌, కల్యాణ్‌రామ్‌లు గురువారం ఎన్టీఆర్‌ ఘాట్‌కు వెళ్లకూడదని నిర్ణయించుకున్నారు. పెద్ద ఎత్తున జనాలు అక్కడికి చేరుకుంటే కరోనా వ్యాప్తి చెందే అవకాశం ఉండటంతో వారు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలో ఇంట్లోనే ఉండి ఆ మహానుభావుడికి నివాళులర్పించనున్నట్టు ఎన్టీఆర్‌, కల్యాణ్‌రామ్‌లు తెలిపారు.