https://www.sakshi.com/sites/default/files/styles/storypage_main/public/article_images/2020/05/27/ap%20corona.jpg?itok=mFOesmWE

ఏపీలో కొత్తగా 68 కరోనా కేసులు

సాక్షి, విజయవాడ : ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా 68 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,787కి చేరింది. రాష్ట్రంలో కొత్తగా నమోదైన కేసుల్లో 9 మంది తమిళనాడులోని కోయంబేడు నుంచి వచ్చివారు ఉన్నారు. ఈ మేరకు రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ బుధవారం ఉదయం కరోనాపై హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది. గత 24 గంటల్లో 9,664 మందికి పరీక్షలు నిర్వహించగా 68 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్దారణ అయినట్టు తెలిపింది. ఇప్పటివరకు 1,913 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి కాగా, 58 మంది మరణించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 816 మంది కరోనాతో చికిత్స పొందుతున్నారు. (చదవండి : భారత్‌లో లక్షా 50వేలు దాటిన కరోనా కేసులు)