https://www.sakshi.com/sites/default/files/styles/storypage_main/public/article_images/2020/05/27/g27.JPG?itok=UEvDjhaw

ఒక్కరోజే రూ.1000 తగ్గిన పసిడి

బుధవారం స్టాక్‌ మార్కెట్లో పసిడి ధర భారీగా తగ్గింది. ఉదయం 10 గంటల ప్రాంతంలో దేశీయ మల్టీకమోడిటీ  మార్కెట్లో నిన్నటితోపోలిస్తే రూ.1,013 తగ్గి 10 గ్రాముల పసిడి రూ.46,048 వద్ద ట్రేడ్‌ అవుతోంది.అంతర్జాతీయ మార్కెట్లోనూ నిన్నటితో పోలిస్తే పసిడి ధర 35 డాలర్లు తగ్గింది. కోవిడ్‌-19కు త్వరలోనే వ్యాక్సిన్‌ అందుబాటులోకి వస్తుందన్న ఆశాభావంతో ఇన్వెస్టర్లు బంగారంపై పెట్టుబడులు తగ్గించడం, ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల్లో లాక్‌డౌన్‌ను క్రమంగా ఎత్తివేస్తూ పరిశ్రమలను తిరిగి పునరుద్దరిస్తుండడంతో బంగారం ధర తగ్గుముఖం పట్టిందని నిపుణులు అంచనా వేస్తున్నారు.