https://www.sakshi.com/sites/default/files/styles/storypage_main/public/article_images/2020/05/27/ppppp.jpg?itok=XD6JNWSS

బెల్లి ఫ్యాట్‌ తగ్గాలంటే ఇలా చేయండి

బెల్లి ఫ్యాట్‌.. ప్రతి ఒక్కరిలో కనిపించే సాధారణ సమస్య. పొట్ట చుట్టూ కొవ్వు బాగా పేరుకుపోవడం వల్ల ఇది ఏర్పడుతుంది. సమయానికి భోజనం చేయకపోవడం, ఆహార నియమాలు పాటించకపోవడం, ఒత్తిళ్లతో కూడిన జీవితం, జంక్‌ఫుడ్‌ ఎక్కువగా తినడం. వ్యాయామం చేయకపోవడం ఇలాంటి కారణలతో ఈ ఫ్యాట్‌ ఏర్పడుతుంది. ఓ వ్యక్తి, మహిళ చూడటానికి ఎంత అందంగా ఉన్నా తనకున్న బెల్లి ఫ్యాట్‌ ఆ అందాన్ని తగ్గిస్తుంది. లేదా ఆ అభిప్రాయాన్ని వెంటనే మార్చుతుంది. దీని నుంచి విముక్తి పొందాలనుకుంటే మాత్రం కొంచెం ఒళ్లు వంచి కాలరీలు కరిగించాల్సిందే. రోజూ ఉదయం అయిదు నిమిషాలు చేసే వ్యాయామం ద్వారా మనం బరువు తగ్గించవచ్చు అన్న విషయం మీకు తెలుసా.. లేదా కేవలం రెండు నిమిషాల పాటు చేసే వ్యాయామం మనలోని కొవ్వును అంతం చేస్తుందన్న విషయం తెలుసా.. అవునండి వాస్తవాలే. 

అలసటను తగ్గిస్తుంది.
ఉదయం పూట చేసే వ్యాయామం వల్ల ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఇది నిద్రను మెరుగుపరుస్తుందని పరిశోధనలో రుజువైంది. దీనివల్ల బరువు, బెల్లి ఫ్యాట్‌ కూడా తగ్గించడంలో ముఖ్యపాత్ర పోషిస్తుంది. అలసటను తగ్గించి రోజంతా మనకు ఉల్లాసాన్ని, శక్తిని అందిస్తుంది. అదే విధంగా మానసిక స్థితి మెరుగుదలకు దోహదపడి ఏకాగ్రతను పెంచుతుంది. ఈ వేళలో ప్రసరించే అల్ట్రా వయోలెట్‌ కిరణాలు ఫంగల్‌, బ్యాక్టీరియల్‌ ఇన్ఫెక్షన్‌ వ్యాప్తిని అరికడతాయి. మరి ఇన్ని ఉపయోగాలు ఉన్నందునే ఉదయం వేళలో వ్యాయామం చేస్తే మంచిదని నిపుణులు సూచిస్తారు. అయితే ఉదయం చేసే వ్యాయామం తమ ఫిట్‌నెస్‌ దినచర్యకు అనుగుణంగా ఉంటాలని నిపుణులు సూచిస్తున్నారు. (కరోనా: వర్క్‌ ఫ్రం హోం వాళ్లు ఇలా చేయండి!)

https://www.sakshi.com/sites/default/files/article_images/2020/05/27/belly.jpg

బరువు తగ్గడానికి ఉదయం చేసే ఉత్తమ వ్యాయామాలు
బెల్లి ఫ్యాట్‌, బరువు తగ్గేందుకు అయిదు నిమిషాలు రోజూవారి వ్యాయామం ఎంతో ఉత్తమ ఫలితాలను ఇస్తుంది. ఇది  నేర్చుకోవడం కూడా ఎంతో సులభం. ఎలాంటి పరికరాలు అవసరం లేదు. ఎక్కడైన చేయవచ్చు. దీన్ని సులభంగా దినచర్యలో భాగం చేయవచ్చు.  ఇది బెల్లి ఫ్యాట్‌ను తగ్గించి అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది. 

1.. పవర్‌ పుష్‌-అప్స్‌
జీవక్రియను పునరుద్ధరించడానికి, బరువు తగ్గడానికి అలాగే కండరాలను బలోపేతం చేయడానికి పుష్‌అప్స్‌ సహాయపడతాయి. ఉదయం పూట  మీరు చేయగలిగే వ్యాయామాలలో ఇది ఉత్తమైనది. పవర్ పుష్-అప్స్ చేయడం వలన మీరు ఫిట్‌గా, ఆరోగ్యంగా ఉంటారు. బలమైన ఉదర కండరాలను నిర్మించడంలో ఇది సహాయపడుతుంది.

https://www.sakshi.com/sites/default/files/article_images/2020/05/27/push.jpg

పవర్ పుష్-అప్స్ ఎలా చేయాలి:
►  తలక్రిందులుగా ఉన్న ‘V’  భంగిమలో ఉండి, మోకాళ్ళతో వంగి,  నడుము వెనక భాగాన్ని పైకి ఉంచి ప్రారంభించండి.
► మీ చేతులను భుజం-వెడల్పు కంటే కొంచెం వెడల్పుగా ఉంచి ఫోటోలో చూపించినట్లు ఉంచండి.
► మీ మోకాళ్ళను వంచి, మీ మోచేతులను పూర్తి పుష్-అప్ స్థానంలో వంచినప్పుడు బరువును ముందుకు ఉంచడి.
► V భంగిమను కొనసాగిస్తూ, మొదట ప్రారంభించినట్లు నడుము వెనక భాగాన్ని పైకి అనండి.
► రెండు భంగిమల మధ్య ముందుకు వెనుకకు బౌన్స్ అవుతూ సుమారు 5 నిమిషాలు వీటిని చేయండి.

జంపింగ్ జాక్స్
ఇతర కార్డియో వర్కౌట్ల మాదిరిగా, ఉదయపు వ్యాయామంలో దీని చేర్చడం వల్ల మంచి ఆరోగ్య ఫలితాను ఇస్తుంఇ. ఇది ఆరోగ్యకరమైన గుండెకు ఉపయోగపడుతుంది. బరువు తగ్గడాన్ని ప్రోత్సహిస్తుంది. అలాగే గుండె, ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని పెంచుతుంది, రక్తపోటును తగ్గిస్తుంది, రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది.

https://www.sakshi.com/sites/default/files/article_images/2020/05/27/jump.jpg

జంపింగ్ జాక్స్ ఎలా చేయాలి:
►  మీ పాదాలతో నిటారుగా నిలబడండి.
ఫోటోలో చూపించినట్టుగా ఒక్కసారిగా పైకి ఎగిరి మీ కాళ్లను కొంచెం దూరంగా విస్తరించడండి. మీ చేతులను మీ తలపైకి తీసుకువచ్చేటప్పుడు భుజం కంటే పైకి తీసుకురండి.
మళ్లీ మీ చేతులను యధాస్థితికి తీసుకు వచ్చి, మీ కాళ్లను ఒకచోట చేర్చండి.
ఒకవేళ మీకు ఈ వ్యాయామంలో అనుభవం ఉంటే తక్కువ వేగంతో చేయండి. ఇలా పదిసార్లు కొద్ది కొద్ది సమయం గ్యాప్‌తో చేయండి.
దీనివల్ల ఎక్కువ ప్రయోజనాలు పొందడానికి ప్రతిరోజూ ఈ వ్యాయామం కోసం నిర్ధిష్ట సమయాన్ని కేటాయించండి.  కేవలం 10 నిమిషాలు అయినా సరిపోతుంది.
► ఒకవేళ ఉదయం ఈ వ్యాయామం చేయలేకపోతే ఫర్వాలేదు. సాయంత్రం అయినా మీరు ఈ దినచర్యను కొనసాగించండి.