https://www.prabhanews.com/wp-content/uploads/2020/05/Untitled-34-copy-15.jpg

నీ నిజమైన ప్రేమకు ఇది పరీక్ష..

ఈ  లాక్‌డౌన్‌ కష్టకాలంలో ‌ తన ప్రియురాలిని కలుసుకునేందుకు సోషల్‌ మీడియాలో సహాయం కోరిన ఓ నెటిజన్‌కు నటుడు  సోనూసూద్ ఇచ్చిన సమాధానం నవ్వులు పూయిస్తోంది.  వలస కార్మికులు తమ సొంత ఊళ్లకు వేళ్లేందు ఆయన రవాణ సౌకర్యం ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో సోషల్‌ మీడియాలో తన సాయం కోరిన వారికి ఆయన స్పందిస్తూ సహాయక చర్యలు అందిస్తున్నాడు. ఈ నేపథ్యంలో   ఓ వ్యక్తి బీహార్‌లో ఉన్న తన ప్రియురాలి దగ్గరి పంపించు భయ్యా అంటూ ట్విటర్‌ లో  కోరాడు. అది చూసిన సోనూ స‍్పందిస్తూ.. ‘భయ్యా.. కొన్ని రోజులు నీ ప్రేమకు దూరంగా ఉండటానికి ప్రయత్నించు. ఎందుకంటే నీ నిజమైన ప్రేమకు ఇది పరీక్ష’ అంటూ తనదైన శైలిలో సమాధానం ఇచ్చాడు. ఈ ట్వీట్‌ ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఆయన హాస్య చతురతకు అభిమానులు ఫిదా అవుతూ తమ స్పందనను తెలుపుతున్నారు.