వాషింగ్టన్ : భారత్ చైనా సరిహద్దు వివాదంలోమధ్యవర్తిత్వం : ట్రంప్
భారత్, చైనా సరిహద్దుల్లో కొద్ది రోజులుగా ఘర్షణ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రెండు దేశాలు అంగీకరిస్తే ఈ వివాదం పరిష్కారానికి తాము మధ్యవర్తిత్వం వహించడానికి సిద్ధంగా ఉన్నామని ట్రంప్ ప్రకటించారు. ఈ విషయాన్ని ఇప్పటికే భారత్, చైనా దేశాలకు కూడా తెలియజేశామని ట్రంప్ ట్వీట్ చేశారు. అయితే ట్రంప్ ట్వీట్‌పై ప్రస్తుతానికి భారత్, చైనా దేశాలు ఎలాంటి స్పందనా కనబర్చ లేదు.
భారత్,చైనాల మధ్య బంధం బలపడాలి
భారత్, చైనాలు దేశాలు రెండూ ప్రస్తుతం కరోనా మహమ్మారికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నాయని, ప్రస్తుత పరిస్థితుల్లో రెండు దేశాల మధ్య సంబంధాలు మరింత బలోపేతం కావాల్సిన అవసరం ఉన్నదని భారత్‌లో చైనా రాయబారి సన్ వీడాంగ్ వ్యాఖ్యానించారు. భారత్, చైనా సంబంధాలకు సంబంధించి రెండు దేశాలకు చెందిన యువత వాస్తవాలు గ్రహించాలని ఆయన సూచించారు.