హైదరాబాద్ :ఎన్‌ఎస్‌యూఐ ప్రగతిభవన్ ముట్టడి
ఎన్‌ఎస్‌యూఐ విద్యార్థులు ప్రగతిభవన్‌ను ముట్టడించారు. డిగ్రీ సెమిస్టర్ ఫీజులు రద్దు చేసి పరీక్షలు నిర్వహించాలని వారు డిమాండ్ చేశారు. కరోనా ప్రభావంతో తమ కుటుంబాలు ఆర్థిక సమస్యలతో ఉన్నాయని విద్యార్థులు చెబుతున్నారు. దీంతో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. దీంతో పోలీసులు విద్యార్థులను అడ్డుకున్నారు. కాగా ఇప్పటికే ఉన్నత విద్యామండలి ఛైర్మన్ పాపిరెడ్డి, మంత్రి సబితా ఇంద్రారెడ్డికి విద్యార్థులు విజ్ఞప్తి చేసినట్టు చెప్పారు.