హైదరాబాద్ : కవలలకు జన్మనిచ్చిన కరోనా గర్భిణి
గాంధీ ఆస్పత్రిలో కరోనా సోకిన గర్భిణికి వైద్యులు సిజేరియన్ చేసి కవల పిల్లలకు ప్రాణం పోశారు. మేడ్చల్‌కు చెందిన గర్భిణి (20) కరోనా పేషంట్‌గా గాంధీలో చికిత్స పొందుతోంది. ఇద్దరూ ఆడ శిశువులు జన్మించగా, వీరిలో ఒకరు 2.5, మరొకరు 2కిలోల బరువుతో ఉన్నారు. తల్లిd పిల్లలు సురక్షితంగా ఉన్నారు. శిశువు లను ముందు జాగ్రత్త చర్యగా తల్లి నుంచి వేరు చేసి ఎన్‌ఐసియులో ఉంచారు.