‘రితేశ్’ వీడియోపై పలువురి ప్రశంసలు..
మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి విలాస్‌రావ్ దేశ్‌ముఖ్ జయంతి సందర్భంగా భావోద్వేగ వీడియోను షేర్ చేశాడు ఆయన తనయుడు..నటుడు రితేశ్ దేశ్ ముఖ్. హ్యాంగర్‌కు తగిలించి ఉన్న తండ్రి కుర్తా స్లీవ్‌లో తన చేతిని ఉంచిన రితేశ్.. దానిని ఆలింగనం చేసుకుని ఆ చేతితో తన తలను తానే నిమురుకున్నాడు. తండ్రే స్వయంగా దిగివచ్చి తనను ఆత్మీయంగా హత్తుకున్నట్టు ఉద్వేగానికి లోనయ్యాడు. మిస్ యూ నాన్నా అంటూ ట్విటర్ వేదికగా నివాళి అర్పించాడు. ‘పుట్టినరోజు శుభాకాంక్షలు నాన్నా.. మిమ్మల్ని రోజూ మిస్సవుతున్నాఅని తెలిపాడు. ఇక ఇందుకు సంబంధించిన వీడియోను వీక్షించిన టాలీవుడ్ హీరో సందీప్ కిషన్.. ‘ఎంత అందమైన వీడియో’అంటూ రితేశ్ ట్వీట్‌ను రీట్వీట్ చేశాడు. అతడితో పాటు మరికొంత మంది సెలబ్రిటీలు, నెటిజన్లు ఈ వీడియోపై ప్రశంసలు కురిపిస్తున్నారు.