బోరు బావిలో బాలుడు
మెదక్ . బోరుబావిలో ఒక బాలుడు పడిన సంఘటన మండల పరిధిలో ని పోడ్ చెన్ పల్లి గ్రామ శివారులో బుధవారం సాయంత్రం చోటుచేసుకుంది. స్థానికులు, కుటింబికుల కథనం ప్రకారం వివరాలు ఇలాఉన్నాయి గ్రామానికి చెందిన మంగలి భిక్షపతి తన వ్యవసాయ క్షేత్రంలో బోరుబావి త్రవ్వడానికి పునుకోని మంగళవారం రాత్రి బోరుబావిని త్రవ్వగా బోరుబావి లో నీరు రాకపోవడంతో రాత్రి నిద్రించి బుధవారం ఉదయం నుండి మల్లీ బోరు బావిని త్రవ్వగా రెండు బోరుబా వులలొ నీరు రాకపోవడంతో బోరుబావుల త్రవ్వకలను ఆపివేసి బోరుబావి గుంతలను పుడుస్తున్న క్రమంలో అక్కడే ఉన్న భిక్షపతి మనువడు సంజయ్ సాయి వర్ధన్ మూడు సంవత్సరాల బాలుడు ఆడుకుంటూ బోరుబావి గుంతలో పడడంతో గమనించిన కుటింబికులు వెంటనే బోరుబావి గుంతవద్ద కు వెళ్ళిచూడగా బాలుడి ఏడుపు విని వెంటనే పాపన్నపేట పోలీసులకు సమాచారం ఇవ్వడంతో యస్ ఐ ఆంజనేయులు, తహసీల్దార్ బలరాం లు సంఘటన స్థలానికి చేరుకుని బోరుబావి నుండి బాలున్ని తియ్యడానికి ఉన్నత అధికారులకు సమాచారం అందించాగా మెడజ్ ఆర్డీఓ సాయిరాం జేసీబీ,108 వాహనాన్ని రప్పించి గుంత నుండి బాలున్ని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. కాగా మంగలి భిక్షపతి కూతురి కొడుకు అయిన గోవర్ధన్ మూడు సంవత్సరాల బాబు, కాగా బాలుడికి మరో ఇరువురు అన్నలు ఉన్నారు. మంగలి నవీన,గోవర్ధన్ లకు ముగ్గురు కుమారులు