https://www.prabhanews.com/wp-content/uploads/2020/05/Untitled-32-copy-17.jpg

పింక్ శారీలో అందాల తార..

పలు తెలుగు సినిమాలతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది నటి మధురిమ. అయితే కెరీర్ లో  ఇంతవరకు సరైన బ్రేక్ దొరకలేదు. దాంతో ఇప్పుడామె తన పేరు మార్చుకుని మార్చుకుంది. మధురిమ తన పేరుని నైనా బెనర్జీగా మార్చుకుంది. బాలీవుడ్ లో  ‘వన్ నైట్ స్టాండ్’ అనే అడల్ట్ కంటెంట్ మూవీలో అందాల ఆరబోత చేసింది. ఈ సినిమాతో బాలీవుడ్ లో సెటిల్ అవ్వాలని అనుకుంది. అందుకే మధురిమగా ఉన్న తన పేరుని నైనా బెనర్జీగా మార్చుకుంది. టాలీవుడ్ లో నటించిన ఈ భామకు బ్రేక్ రాలేదు. దాంతో కన్నడ – మలయాళ చిత్రాల్లో కూడా చాలానే ప్రయత్నాలు చేసినా ఫలితం లేదు. తెలుగులో చాలా సినిమాలు చేసిన మధురిమ.. హీరోయిన్ గాను ఐటెం భామగాను అలరించింది. ఆరెంజ్ మూవీలో రామ్ చరణ్ పక్కన కాసేపు కనిపించిన ఎక్స్ పీరియన్స్ కూడా ఉంది. ఇక అమ్మడు తాజాగా ఇన్ స్టా గ్రామ్  లో పింక్ సారీలో ఫోటో పోస్ట్ చేసింది. చీరలో అమ్మడి అందాలు రెట్టింపు అయ్యాయి. పింక్ శారీలో మెరిసిపోయింది ఈ బ్యూటీ.