హీరో సూర్యకు గాయాలు
తమిళ హీరో సూర్యకు గాయాలయ్యాయి. లాక్‌డౌన్ కాలంలో సూర్య వర్కవుట్ చేస్తుండగా గాయాల పాలయ్యారనే ప్రచారం సామాజిక మాధ్యమాల్లో జోరుగా సాగుతోంది. దీంతో ఆయన అభిమానులు ఆందోళన చెందుతున్నారు. తమ అభిమాన నటుడు త్వరగా కోలుకోవాలని ప్రార్థనలు చేస్తున్నారు. అయితే దీనిపై సూర్య బంధు వర్గాలను విచారించగా సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరుగతున్నట్లు పెద్దగా గాయాలేమీ కాలేదని చెప్పారు. ఇటీవల వర్కవుట్ చేస్తుండగా ఆయన ఎడమ చెయ్యికి గాయమైందన్నారు. వెంటనే ఆసుపత్రికి వెళ్లి చికిత్స చేయించుకున్నారని తెలిపారు. ఇప్పుడు సూర్య చేతి గాయం 90 శాతం నయమైందన్నారు. లాక్‌డౌన్ పూర్తి కాగానే హరి దర్శకత్వంలో అరువా చిత్ర షూటింగ్‌లో పాల్గొంటారని సమాచారం. అదేవిధంగా సుధ కొంగర దర్శకత్వంలో సూరారై పొట్రు చిత్రాన్ని పూర్తిచేసిన సూర్య ఆ చిత్రం విడుదల కోసం ఎదురు చూస్తున్నారు.