http://www.prajasakti.com/./mm/20200527//1590573427.vupasana.jpg

ఉపాసన తాత కామినేని ఉమాపతిరావు మృతి

హైదరాబాద్‌ : మెగాస్టార్‌ చిరంజీవి కోడలు ఉపాసన తాత కామినేని ఉమాపతి రావు బుధవారం మరణించారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఈ రోజు ఉదయం మరణించారని ఉపాసన తన ట్విటర్‌ వేదికగా సంతాపం తెలిపారు. మా తాత కె. ఉమాపతిరావు గొప్ప విలువలు, నిస్వార్థం కలిగిన వ్యక్తి అని, ఆయనకు హాస్య చతురత కూడా ఎక్కువేనని పేర్కొన్నారు. ఉర్దూలో రాసిన షాయరీలు, ఇతర రచనల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదని అన్నారు. టిటిడి తొలి ఇఒగా పనిచేసిన ఆయన అనేక సేవా కార్యక్రమాల్లో పాల్గన్నారని ట్వీట్‌ చేశారు.