http://www.prajasakti.com/./mm/20200527//1590594870.CHINA.jpg

సరిహద్దుల్లో పరిస్థితి అదుపులోనే ఉంది: చైనా

బీజింగ్‌ : భారత్‌తో సరిహద్దుల్లో పరిస్థితి అంతా అదుపులోనే ఉందని చైనా బుధవారం పేర్కొంది. చర్చలు, సంప్రదింపులు ద్వారా సమస్యను పరిష్కరించుకోవడానికి ఇరుదేశాలకు సరైన యంత్రాంగం, సమాచార వ్యవస్థలు ఉన్నాయని తెలిపింది. వాస్తవాధీన రేఖ వద్ద భారత్‌-చైనా మిలిటరీ మధ్య ప్రతిష్టంభన కొనసాగుతున్నట్లు వార్తలొస్తున్న
నేపథ్యంలో చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి ఝావో లిజాన్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. సరిహద్దు సంబంధిత సమస్యలపై చైనా వైఖరి స్పష్టంగానూ, స్థిరంగానూ ఉంటుందని ఆయన తెలిపారు. ఇరుదేశాల నాయకుల మధ్య కుదిరిన ముఖ్యమైన ఏకాభిప్రాయాన్ని మేము అనుసరిస్తున్నామని, అలాగే ఇరు దేశాల మధ్య జరిగిన ఒప్పందాలను కచ్చితంగా పాటిస్తున్నామని చెప్పారు. తమ ప్రాదేశిక సార్వభౌమాధికారాన్ని, సరిహద్దు ప్రాంతాల్లో భద్రత, శాంతి, స్థిరత్వాన్ని పరిరక్షించేందుకు తాము కట్టుబడి ఉన్నామనిచెప్పారు.
నినినిని