అయితే జనవరి.. లేదంటే ఏప్రిల్
- అప్పటి నుంచి ఆర్థిక రంగం క్రమంగా కోలుకోవచ్చు..
- ఉద్యోగాల్లో కోత.. నిరుద్యోగం 28 నుంచి 33% పెరిగే అవకాశం
- ఆతిథ్య, ఆటోమొబైల్, రియల్ ఎస్టేట్ రంగాలపై తీవ్ర ప్రభావం
- కేంద్ర ప్యాకేజీ ప్రాధాన్యతారంగాల వారీగా ఇచ్చి ఉంటే బాగుండేది
- కరోనా, లాక్‌డౌన్ ప్రభావాలపై ఆర్థిక నిపుణుడు తిరుపతిరెడ్డి
సాక్షి, హైదరాబాద్: ‘వచ్చే జనవరికల్లా దేశంలో కరోనా ప్రభావం పూర్తిస్థాయిలో తగ్గిన పక్షంలో ఆర్థికంగా కొంత వెసులుబాటు ఉంటుంది. అ ప్పటికీ తగ్గకుంటే వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి ఆ ర్థికరంగం క్రమంగా కోలుకునే అవకాశాలున్నా’ యని ఆర్థిక నిపుణుడు తిరుపతిరెడ్డి భీముని చె ప్పారు. కీలక రంగాలపై మరో ఆరేడు నెలల దాకా కరోనా ప్రభావం ఉంటుందని విశ్లేషించా రు. దీని నుంచి పూర్తిస్థాయిలో కోలుకునే వరకు ఇప్పటి వరకు ఉన్న ‘సేవింగ్స్’ను వివిధ వర్గాల ప్రజలు జాగ్రత్తగా కాపాడుకోవాలని సూచించా రు. డిసెంబర్ చివరిదాకా వేచిచూసి, జనవరి నుంచి ఆయా రంగాల్లో పెట్టుబడులు పెట్టడం నెమ్మదిగా మొదలుపెట్టొచ్చని చెప్పారు. కరోనాను ఎదుర్కోవడంలో భారత్ చూపిన చొరవ, స్ఫూర్తి, ఆత్మస్థైర్యం, దేశంలో ఉన్న అనుకూల పరిస్థితుల దృష్ట్యా ఇక్కడ పెట్టుబడులు పెట్టేం దుకు విదేశాలు ఆసక్తి చూపొచ్చన్నారు. కరోనా ప్రభావం ఏయే రంగాలపై, ఏ మేరకు పడుతుందనే దానిపై వివరాలు ఆయన మాటల్లోనే..
18 నుంచి 22% ఉద్యోగాల్లో కోత
► దేశంలోని జాబ్ మార్కెట్‌లో 18 నుంచి 22 శాతం ఉద్యోగాల్లో కోత పడవచ్చు.
► చిన్న, మధ్యతరహా పరిశ్రమల్లో కొన్ని మూతపడే అవకాశ ముంది. ఈ రంగాల్లో 28 –33% వరకు నిరుద్యోగం పెరగవచ్చు.
► రిటైల్ ఇండస్ట్రీలో నిత్యావసర వస్తువులు మి నహా రిటైల్ రంగాలు కోలుకునేందుకు కొం త సమయం పట్టొచ్చు. కరోనా, లాక్‌డౌన్ ప్రభావం ఈ రంగంపై తీవ్రంగా పడింది.
ఈ రంగాలపై ప్రభావం అధికం..
ఆతిథ్య రంగం: పర్యాటకం, హోటళ్లు, అనుబం ధ రంగాలతో ముడిపడిన ఆతిథ్యరంగం 40 – 50 శాతం దాకా నష్టపోవచ్చు. దేశంలో జనవరి –జూన్ మధ్య అధికశాతం ప్రజలు ప్లెజర్‌ట్రిæప్లు, విదేశీయానాలు, టూర్లకు వెళుతుంటారు. పెళ్లి ళ్లు, ఇతర సోషల్ గ్యాథరింగ్స్ నిలిచిపోవడంతో ఈ రంగం తీవ్రంగా నష్టపోనుంది.
రియల్ ఎస్టేట్, నిర్మాణరంగాలు: ప్ర స్తుత పరిస్థితుల్లో రియల్ ఎస్టేట్ రంగంలో ప్లాట్లు కొనే వారుండ రు. నగర శివారు ప్రాంతాల్లో ఓ పెన్ ప్లాట్లకి డిమాండ్ 20–30% తగ్గొచ్చు. కొత్త ప్రాజెక్టులు వచ్చే అవకాశా లు తక్కువే. ఉన్న ప్రాజెక్టుల పూర్తికి ఆర్థిక ఇబ్బందులు ఎదురవ్వొచ్చు.
ఆటోమొబైల్ రంగం: కరోనాకు ముందే ఈ రం గం కొంత ఇబ్బందుల్లో ఉంది. ప్రస్తుత పరిణా మాలతో మరిన్ని కష్టాలు తప్పకపోవచ్చు. ప్రస్తుతం ఈ రంగంలో ముడిసరుకులు చైనా నుంచి 35 శాతం దిగుమతి అవుతుండడంతో ఇబ్బందికర పరిస్థితులు ఎదురుకానున్నాయి.
సినిమా, టీవీ రంగాలు: సినిమాలు విడుదల కా క, టీవీ సీరియళ్ల షూటింగ్స్ జరగక కొన్ని వేల కోట్ల రూపాయల మేరకు ఈ రంగం నష్టాలు చ విచూసే అవకాశాలున్నాయి. వీటిపై ప్రత్యక్షం గా, పరోక్షంగా ఆధారపడిన కొన్ని లక్షల కుటుం బాలు ఆర్థికంగా ఇబ్బంది పడనున్నాయి.
‘ప్యాకేజీ’ ఫలాలు ఇప్పుడే తెలియవు..
► కేంద్ర ప్రభుత్వం రూ.20 లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీ ప్రకటించినా అది నేరుగా చిన్నతరహా పరిశ్రమలకు చేరకపోవడం వల్ల ప్యాకేజీతో వాటికి అంతగా వెసులుబాటు లభించలేదు. ఈ పరిశ్రమలు మళ్లీ బ్యాంకుల ద్వారా రుణాలు పొందాలి. అందుకు బ్యాంకులు సిద్ధమేనా? అనేది తేలాలి.
► ప్రాధాన్యతారంగాలను ఎంచుకుని ఆయా రంగాల వారీగా నిర్దేశిత ప్యాకేజీలు ప్రకటించి ఉంటే బావుండేది.
► ప్రస్తుతం ఎక్కువగా నష్టపోతున్న పర్యాటక, రవాణా, ఆతిథ్య, లాజిస్టిక్స్, ఎంటర్‌టైన్‌మెంట్, వాటి అనుబంధ సహాయకరంగాలను ఆదుకోవాలి. వీటిలో పనిచేసే వారు ఉద్యోగాలు, ఉపాధి కొంతమేర కోల్పోయే అవకాశముంది.
► కేంద్ర ప్యాకేజీ వల్ల వెంటనే ఫలితాలు వచ్చే అవకాశం లేదు. పరిశ్రమలతో పాటు ఇతర ఏయే రంగాలకు ఎలాంటి సహాయం అందింది, ఏ మేరకు కోలుకున్నాయి?, ఏ మేరకు సత్ఫలితాలొచ్చాయనేది తెలుసుకునేందుకు మరికొంత సమయం పడుతుంది.
కరోనాతో అనుకూలంగా మారేవి..
► డిజిటలైజేషన్‌కు ప్రాధాన్యం పెరుగుతుంది
► ఆన్‌లైన్ కోచింగ్‌లు, ఆన్‌లైన్ బోధన పెరుగుతాయి
► ఆరోగ్యంపై శ్రద్ధ పెరిగి బీమా రంగం అభివృద్ధి చెందుతుంది
► విదేశాలపై ఎక్కువగా ఆధారపడకుండా మేకిన్ ఇండియా స్ఫూర్తితో ముందుకెళ్లొచ్చు.