నేడు వ్యవసాయంపై సమీక్ష
- సీఎం వైఎస్ జగన్ అధ్యక్షతన మేధోమథన సదస్సు
సాక్షి, అమరావతి: ‘మన పాలన–మీ సూచన’ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న మేధోమథన సదస్సుల్లో భాగంగా మంగళవారం వ్యవసాయం, అనుబంధ రంగాలపై సమీక్ష జరుగుతుంది. ఈ సదస్సుకు వ్యవసాయ, సహకార శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి పూనం మాలకొండయ్య సమన్వయ కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు.
ఇందుకోసం ఏర్పాటైన కమిటీలో ఆమెతోపాటు మార్కెటింగ్ కార్యదర్శి, ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శి, ఇరిగేషన్ శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి, పశు సంవర్థక శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి, వ్యవసాయ, మార్కెటింగ్, ఫిషరీస్, హార్టికల్చర్ శాఖల కమిషనర్లు, ఆహార శుద్ధి విభాగం సీఈవో, పశు సంవర్థక శాఖ డైరెక్టర్ ఉన్నారు. సదస్సుకు 13 జిల్లాల నుంచి 24 మంది రైతులు, వివిధ రంగాలకు చెందిన 14 మంది నిపుణులు, విశ్వవిద్యాలయాల శాస్త్రవేత్తలు, ఆక్వా, డెయిరీ రంగ ప్రముఖులు, ఇండియన్ టుబాకో కంపెనీ (ఐటీసీ) వంటి సంస్థల ప్రతినిధులు హాజరవుతున్నారు.