https://www.sakshi.com/sites/default/files/styles/storypage_main/public/article_images/2020/05/26/STOP_CORONA.jpg?itok=N5f0WGhq

రాష్ట్రంలో తాజాగా 41 మంది డిశ్చార్జి



సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కొత్తగా 41 మంది డిశ్చార్జి కావడంతో సోమవారానికి కరోనా వైరస్‌ నుంచి కోలుకున్న వారి సంఖ్య 1,884కు చేరింది. ఆదివారం ఉదయం 9 గంటల నుంచి సోమవారం ఉదయం 9 గంటల వరకు మొత్తం 10,240 మందికి పరీక్షలు నిర్వహించగా అందులో 89 మందికి పాజిటివ్‌ అని నిర్ధారణ అయ్యింది. ఇందులో 45 కేసులు

https://www.sakshi.com/sites/default/files/article_images/2020/05/26/4444.jpg

విదేశాల నుంచి వచ్చిన వారివి ఉన్నాయి. కువైట్‌ నుంచి వచ్చిన 41 మంది, ఖతార్‌ నుంచి వచ్చిన ముగ్గురికి, సౌదీ అరేబియా నుంచి వచ్చిన ఒకరికి కరోనా లక్షణాలు ఉన్నట్లు తేలింది.

అదే విధంగా తమిళనాడులోని కోయంబేడుకు వెళ్లి వచ్చిన మరో ఏడుగురికి వైరస్‌ సోకినట్లు నిర్ధారించారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 2,886కు చేరింది. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ సోమవారం విడుదల చేసిన బులెటిన్‌లో పేర్కొంది. పాజిటివ్‌ కేసుల్లో విదేశాల నుంచి వచ్చిన 62 కేసులకు తోడు, వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన వారికి సంబంధించి 153 కేసులు కూడా ఉన్నాయి. గడిచిన రెండు రోజులుగా ఎటువంటి మరణాలు నమోదు కాలేదు. ఇప్పటి వరకూ రాష్ట్రంలో కరోనాతో మరణించిన వారి సంఖ్య 56గా ఉంది. ప్రస్తుతం కరోనా యాక్టివ్‌ కేసుల సంఖ్య 946గా ఉంది.