మరో 66 కేసులు.. ముగ్గురు మృతి
- నమోదైన కేసుల్లో జీహెచ్ఎంసీ పరిధిలో 31
- విదేశీయులు 18 మంది, వలసదారులు 15 మంది
- మొత్తం 1,920కి చేరిన కేసులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో సోమవారం మరో 66 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ముగ్గురు చనిపోయారు. నమోదైన కేసుల్లో జీహెచ్‌ఎంసీకి చెందిన 31 మంది, రంగారెడ్డి జిల్లాకు చెందిన ఒకరు, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వలసదారులు 15 మంది, విదేశాల నుంచి వచ్చినవారు 18 మంది ఉన్నారు. ఇక మహారాష్ట్రకు చెందిన ఒకరు ఉన్నారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 1,920కి చేరింది. మొత్తం ఇప్పటివరకు 56 మంది మృతి చెందారు. ప్రస్తుతం ఆసుపత్రిలో 700 మంది చికిత్స పొందుతున్నారని ప్రజారోగ్య డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాస్‌రావు తెలిపారు. సోమవారం 72 మంది కోలుకోగా, వారితో కలిపి ఇప్పటివరకు 1,164 మంది డిశ్చార్జి అయ్యారని వివరించారు. తాజాగా నమోదైన 66 కేసుల్లో 32 తెలంగాణకు చెందినవని, మిగిలినవి విదేశాల నుంచి వచ్చిన వారు, వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన వలసదారులు, మహారాష్ట్రకు చెందిన ఒకరు ఉన్నారని పేర్కొన్నారు.