https://www.sakshi.com/sites/default/files/styles/storypage_main/public/article_images/2020/05/26/CURREENT-BILL.jpg?itok=XS1Z4isD

వినియోగం మేరకే బిల్లు



సాక్షి, అమరావతి: లాక్‌డౌన్‌ సందర్భంగా ఏప్రిల్, మే నెల విద్యుత్‌ వినియోగం గత ఏడాదితో పోలిస్తే 7 శాతం పెరిగిందని ఇంధనశాఖ సోమవారం వెల్లడించింది. సామాన్య, మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి వినియోగదారుల టారిఫ్‌ పెరిగిందనే ప్రచారంలో నిజం లేదని వివరించింది. కరోనా కారణంగా లాక్‌డౌన్‌ అమలు కావడం వల్ల ఏప్రిల్‌ నెలలో మీటర్‌ రీడింగ్‌ తీయలేదు. మార్చి నెలలో వచ్చిన బిల్లునే ఏప్రిల్‌లోనూ చెల్లించాలని అధికారులు ఆదేశించారు.

తర్వాత మే నెలలో రీడిండ్‌ తీసినప్పటికీ మార్చి, ఏప్రిల్, మే నెలలో రోజులను విడివిడిగానే లెక్కించారు. దీంతో రాష్ట్రంలో విద్యుత్‌ టారిఫ్‌ రేట్లు పెరిగాయన్న వదంతులు వ్యాపించాయి. క్షేత్రస్థాయి వివరాలు సేకరించిన విద్యుత్‌ శాఖ ఇవన్నీ అపోహలేనని గణాంకాలతో పేర్కొంది. పెరిగిన వినియోగం మేరకే బిల్లులు వచ్చాయని రుజువు చేసే ప్రయత్నం చేసింది.  

https://www.sakshi.com/sites/default/files/article_images/2020/05/26/5555532.jpg