
ఆగస్ట్‌లో ఆరంభం
లేడీ సూపర్ స్టార్స్ నయనతార, సమంత హీరోయిన్లుగా, విజయ్ సేతుపతి హీరోగా తమిళంలో ఓ సినిమా తెరకెక్కుతోంది. విఘ్నేష్ శివన్ దర్శకత్వం వహించనున్న ఈ సినిమాకు ‘కాదువాక్కుల రెండు కాదల్’ అనే టైటిల్ ఖరారు చేశారు. ముక్కోణపు ప్రేమకథగా తెరకెక్కనున్న ఈ చిత్రం వినోద ప్రధానంగా సాగనుంది. ఈ సినిమా షూటింగ్ మేలో ప్రారంభం కావాల్సి ఉంది. కరోనా వల్ల చిత్రీకరణ ఆగింది. తాజాగా ఆగస్ట్ నెల నుంచి ఈ సినిమా చిత్రీకరణను ప్రారంభించాలనుకుంటున్నారని సమాచారం. ఇటీవలే టీవీ కార్యక్రమాల చిత్రీకరణకు తమిళనాడు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. త్వరలోనే సినిమా షూటింగ్స్‌కి కూడా అనుమతి లభిస్తుందనే ఉద్దేశంతోనే ఆగస్ట్‌లో షూటింగ్ ప్రారంభించేందుకు ఈ చిత్రబృందం ప్లాన్ చేస్తోంది.