![https://www.sakshi.com/sites/default/files/styles/storypage_main/public/article_images/2020/05/26/Dhawan.jpg?itok=nMkavKqF https://www.sakshi.com/sites/default/files/styles/storypage_main/public/article_images/2020/05/26/Dhawan.jpg?itok=nMkavKqF](https://www.sakshi.com/sites/default/files/styles/storypage_main/public/article_images/2020/05/26/Dhawan.jpg?itok=nMkavKqF)
ఐపీఎల్‌తో కొత్త ఉత్సాహం: ధావన్
న్యూఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)ను నిర్వహిస్తే ఒక్కసారిగా అందరి మనస్థితి మారిపోతుందని భారత ఓపెనర్ శిఖర్ ధావన్ అభిప్రాయపడ్డాడు. కరోనాతో అనిశ్చితి నెలకొన్నప్పటికీ తనకు ఈ ఏడాది ఐపీఎల్ జరుగుతుందనే నమ్మకముందని చెప్పాడు. ‘ఒకవేళ ఐపీఎల్ జరిగితే అందరిపై దీని ప్రభావం కచ్చితంగా ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా లీగ్‌ను ఆదరిస్తారు కాబట్టి కరోనాతో నెలకొన్న భయానక పరిస్థితుల్లో మార్పు వస్తుంది. అందరూ మ్యాచ్‌ల్ని ఆస్వాదిస్తారు. కానీ ఖాళీ స్టేడియాల్లో మ్యాచ్‌లు జరిగితే మేం ప్రేక్షకులు అందించే ఉత్సాహాన్ని కోల్పోతాం’ అని ధావన్ పేర్కొన్నాడు.