హైదరాబాద్ లో కరోనా కేసులు ఎక్కువగా ఉన్నవి ఈ ప్రాంతాలే
by Sridhar Raavi, By Mirchi9తెలంగాణలో నమోదు అవుతున్న కేసులలో 70-80 శాతం జీహెచ్ఎంసీ ప్రాంతంలోనివే. మిగిలిన జిల్లాల నుండి ఈ మధ్య కాలంలో కేసులు నమోదు కావడం లేదు. అయితే జీహెచ్ఎంసీ ప్రాంతం అత్యంత జనసాంద్రత కలిగిన ప్రాంతం కావడంతో ప్రజలు ఈ పరిణామం పై చాలా ఆందోళనగా ఉన్నారు.
అయితే ప్రధానంగా కొన్ని ప్రాంతాల్లోనే పంజా విసురుతోంది. ఆ ఏరియాల్లో కుటుంబాలకు కుటుంబాలే.. ఆస్పత్రుల్లో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ ప్రాంతాలలోనే మెజారిటీ కంటైన్మెంట్ జోన్లు ఉన్నాయి. అయినా కేసులు తగ్గుముఖం పట్టకపోవడం ఆందోళన కలిగించే విషయం.
గ్రేటర్‌లో మలక్‌పేట, సరూర్‌నగర్, ఎల్బీనగర్, హయత్‌నగర్, జియాగూడ, మంగళ్‌హాట్, ఆసిఫ్‌నగర్‌లలోనే ఎక్కువ కేసులున్నాయి. ఆ ఏడు ఏరియాల పరిధుల్లో దాదాపుగా 500 పాజిటివ్ కేసులు నమోదు కాగా, దాదాపుగా పాతిక మంది మృత్యువాత పడ్డారు. ఇంకో విశేషం ఏమిటంటే… ఈ ప్రాంతాలలోనే లాక్ డౌన్ సమయంలో ఎక్కువగా ఉల్లంఘనలు జరిగాయి.
దానికి భారీగా మూల్యం చెల్లించుకోవాల్సి పరిస్థితి. నిన్నటి మెడికల్ బులెటిన్ ప్రకారం… తెలంగాణాలో 1,854 కేసులు నమోదు అయ్యాయి. తక్కువ టెస్టులపై కేంద్రం ఆగ్రహం వ్యక్తం చేస్తూ లేఖ రాసాకా కొంతమేర టెస్టులు పెంచారు. అయినా ఇప్పటికే దక్షిణాదిలో తక్కువ టెస్టులు చేసింది తెలంగాణనే.