కోరోనా నియంత్రణకు కృత్రిమ మేధ..
బెంగుళూరు: కరోనాను నియంత్రించేందుకు వైద్యులు, శాస్తవేత్తలకు కృత్రిమ మేధ(ఆర్టిఫీషియల్ ఇంటలిజన్స్) ఎంతో ఉపయోగపడుతుందని బెన్నెట్ వర్సిటీలో జరిగిన వెబినార్‌లో నిపుణులు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా కరోనా ఉదృతి కారణంగా డిజిటల్ వైపు ప్రజలు మొగ్గు చూపుతున్నారని ఐబీఎమ్ ఎండీ సందీప్ పటేల్ అభిపప్రాయపడ్డారు. ఏఐ సొల్యుషన్స్ ఫర్ కోవిడ్ అనే అంశంతో సోమవారం వెబినార్ జరిగింది. కాగా భారత్‌లో గుండెకు సంబంధించిన రోగాలతో అధిక జనాభా బాధపడుతున్నారని టెక్ దిగ్గజం గూగుల్ తెలిపింది. వలస కార్మికుల సమస్యలు పరిష్కరించడానికి ప్రజలకు గూగుల్ మ్యాప్‌లు ద్వారా కచ్చితమైన సమాచారాన్ని చేరవేస్తున్నట్లు గూగుల్ ఇండియా రీసెర్చ్ డైరెక్టర్ మనీష్ గుప్తా పేర్కొన్నారు.
అయితే రోగి జీవన శైలి, ఆరోగ్య వ్యవస్థ మెరుగుపరుచేందుకు కృత్రిమ మేధ ఎంతో ఉపయోగపడుతుందని గూగుల్ సంస్థ ప్రతినిధులు పేర్కొన్నారు. కృత్రిమ మేధ ద్వారా వ్యక్తి డీఎన్‌ఏని క్షుణ్ణంగా పరిశీలించవచ్చని ఎన్‌వీడియా ఎండీ విశాల్ దుపార్ తెలిపారు.