సన్‌రైజ్ ఫుడ్స్‌ను కొనుగోలు చేసిన ఐటీసీ
ముంబై: దేశంలోని ఎఫ్‌ఎమ్‌సీజీ రంగానికే బ్రాండ్ ఇమేజ్ క్రియెట్ చేసిన ప్రముఖ ఎఫ్‌ఎమ్‌సీజీ దిగ్గజం ఐటీసీ లిమిటెడ్ కీలక నిర్ణయం వెల్లడించింది. కోల్‌కతా కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహించే సన్‌రైజ్ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ (ఎస్‌ఎ్‌ఫపీఎల్) కంపెనీని కొనుగోలు చేసినట్లు ఆదివారం ప్రకటించింది. ఈ ఒప్పందంలో భాగంగా ఐటీసీ రూ.1,800 కోట్ల నుంచి రూ.2,000 మేర చెల్లించి ఉంటుందని మార్కెట్ నిపుణల అంచనా వేస్తున్నారు. దేశంలోని మసాలా, సుగంధ ద్రవ్యాల మార్కెట్‌లో సన్‌రైజర్స్ ఫుడ్‌కు మంచి పేరుంది.
ఎఫ్‌ఎమ్‌సీజీ మార్కెట్లలో మరింత వృద్ధిని పెంచుకునేందుకు ఈ నిర్ణయం దోహదం చేస్తుందని ఐటీసీ లిమిటడ్ పేర్కొంది. తెలంగాణ, ఆంధ్రప్రదేలో ఆశీర్వాద్ గోదుమపిండి వినియోగదారులను ఏ విధంగా ఆకట్టుకుందో .. సన్‌రైజ్ ఫుడ్స్ ద్వారా దేశ వ్యాప్తంగా ఐటీసీ మరింత వృద్ధి సాధిస్తుందని కంపెనీ స్పష్టం చేసింది. రైతుల ఆదాయాలు పెంచడానికి ఈ నిర్ణయం దోహదం చేస్తుందని కంపెనీ ఉన్నతాధికారులు తెలిపారు.