లాక్‌డౌన్: అయ్యే ఈ సారి భాయిజాన్ సినిమా లేదే!
ముంబై: గత కొన్నాళ్లుగా ఈద్ అంటే కొత్త బట్టలు, రంజాన్ తోఫా, రకరకాల వంటకాలు, ఖీర్, బిర్యానీ... భాయిజాన్ సల్మాన్ ఖాన్ కొత్త సినిమా. ఇలా ఈద్ 2009 నుంచి కొనసాగుతుంది. అయితే 2020 ఈద్ అందుకు భిన్నంగా జరిగింది. భాయిజాన్ కొత్త సినిమా తప్పా మిగిలిన అన్ని ఉన్నప్పటికీ అభిమానుల్లో అసంతృప్తి. ఎందుకు ప్రతీ రంజాన్‌కు భాయిజాన్ సినిమా థీయోటర్‌లో చూడందే వారికి పండుగ పండగలా ఉండదు.
ఇక మాస్ దర్శకుడు పూరిజగన్నాద్ రూపోందించిన తెలుగు ‘పోకిరి రీమేక్ ‘వాంటెడ్’ 2009 ఈద్ సందర్భంగా విడుదలై బీ-టౌన్ బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచి కలేక్షన్‌ల వర్షం కురిపించింది. 2010-‘చుల్‌బుల్ పాండే’, 2011-‘బాడీగార్టు’, 2012-‘ఎక్ తా టైగర్’తో రంజాన్‌కు అభిమానులను అలరించిన భాయిజాన్ 2013లో కాస్తా బ్రేక్ ఇచ్చాడు. ఆ తర్వాత 2014-‘కిక్’, 2015-‘భజరంగీ భాయిజాన్’, 2016-‘సుల్తాన్’, 2017-‘ట్యూబ్‌లైట్’, 2018-‘రేస్’, 2019-‘భరత్’తో థీయోటరలో ఈద్ సందర్భంగా అభిమానులను పలకరించాడు. (కరోనా : సల్మాన్ కొత్త బ్రాండ్ లాంచ్)
అయితే 2020లో ఈద్ కానుకగా సల్మాన్, దిశా పటానీల రాధేను విడుదల చేయనున్నట్లు సల్మాన్ గతేడాది సోషల్ మీడియాలో ప్రకటించిన విషయం తెలిసందే. కరోనా వ్యాప్తిన అరికట్టేందు దేశవ్యాప్తంగా అమలవుతున్న లాక్‌డౌన్ కారణంగా దేశంలో సినిమా థీయోటర్లతో పాటు ఇతర వ్యాపార సంస్థలు మూతపడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సినిమా షూటింగ్‌లను కూడా నిలిపివేయడంతో ‘రాధే’ చిత్రం విడుదల వాయిదా పడింది. దర్శకుడు ప్రభుదేవా తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో దిశా పటానీ ఫీమేల్ లీడ్ రోల్‌లో నటిస్తున్నారు. అంతేగాక రణ్‌దీప్ హుడా, జాకీ ష్రాఫ్‌లు కీలక పాత్రలో కనిపించనున్నారు. (సల్మాన్‌తో పూరి సినిమా?)