టీడీపీ వ్యతిరేక వేవ్ లో కూడా బాలయ్య గెలిచింది ఇందుకే
by Sridhar Raavi, By Mirchi92019 ఎన్నికలు తెలుగుదేశం పార్టీకి పీడ కల వంటివి. 175 సీట్లలో ఆ పార్టీ కేవలం 23 సీట్లు మాత్రమే గెలుచుకుంది. అలాగే కేవలం మూడు ఎంపీ సీట్లతో సరిపెట్టుకుంది. రాయలసీమ ఫలితాలైతే ఇంకా దారుణం. కేవలం మూడే సీట్లు గెల్చుకుంది ఒక పార్టీ. ఒక సీటు చంద్రబాబుది తీసేస్తే, గెలిచినా మిగతా ఇద్దరు బాలయ్య, పయ్యావుల కేశవ్.
బాలయ్య ఆయన తన 2014 మెజారిటీ కంటే మెజారిటీ పెంచుకోవడం విశేషం. ఇదే సమయంలో చంద్రబాబు మెజారిటీ కూడా తగ్గింది. ఇది చాలా మందికి ఆశ్చర్యమే. ఎందుకంటే అప్పట్లో సాక్షి, వైఎస్సార్ కాంగ్రెస్ బాలయ్యని ఓడించడానికి గట్టి ప్రయత్నమే చేసింది. నియోజకవర్గంలో బాలయ్య మీద వ్యతిరేక పవనాలు వీస్తున్నట్టు గట్టిగా ప్రచారం చేశారు.
నాగబాబు వంటి వారైతే మీరు ఎలా గెలుస్తారో చూస్తాం అంటూ సవాలు చేశారు. అయితే అందరి అంచనాలు తారుమారు చేశాడు బాలయ్య. సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న ఒక ఆడియో క్లిప్ వింటే బాలయ్య ఎందుకు గెలవగలిగాడో తెలుస్తుంది. ఒక కార్యకర్త తో ఎంతో ఆప్యాయం గా మాట్లాడాడు బాలయ్య. కుటుంబ యోగక్షేమాలు కనుక్కుని, ఎమన్నా కావాలంటే మొహమాట పడకుండా తనను అడగాలని చెప్పాడు.
“బాలయ్య గురించి బయట చెప్పుకునేది ఒకటి, అసలైనది ఒకటి. కార్యకర్తలందరినీ ఆయన ఎంతో ఆప్యాయంగా చూసుకుంటారు. ఎప్పటికప్పుడు ఆప్యాయంగా పలకరిస్తారు. వారికి ఏం కావాలన్నా చూసుకుంటారు. అందుకే ఎన్నికలు అనగానే ఆయన గెలుపు కోసం ప్రాణం పెట్టేస్తారు. దీనితో బాలయ్యకు హిందూపూరంలో ఎదురే లేదు,” అంటూ ఒక కార్యకర్త చెప్పుకొచ్చాడు.