https://www.sakshi.com/sites/default/files/styles/storypage_main/public/article_images/2020/05/25/sonu-sood.jpg?itok=36UNPM_U

నెటిజన్‌కు.. సోన్ ‌సూద్‌ దిమ్మ తిరిగే సమాధానం

సాక్షి, ముంబై: కరోనా వైరస్‌ కట్టడిలో భాగంగా ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్‌లో వలస కార్మికులు తమ సొంత ప్రాంతాలకు మండుటెండలో రహదారుల వెంట నడుచుకుంటూ వెళ్తు ఇబ్బందులు పడుతున్నారు. వలస కార్మికులు కష్టాలను చూసి చలించిపోయిన బాలీవుడ్‌ నటుడు సోనూ సోద్ ముంబైలో చిక్కుకున్న కర్ణాటక వలస కూలీలను పది బస్సుల్లో వారి ఇళ్లకు పంపించాడు. అదే విధంగా పంజాబ్‌లోని వైద్యులకు పిపిఈ కిట్లు కూడా బహూకరించిన సంగతి తెలిసిందే. ఇక ముంబైలోని తన హోటల్‌ను కోవిడ్‌ చికిత్సలో పని చేస్తున్న వైద్య సిబ్బంది బసకు ఇచ్చాడు. ఇలా వలస కార్మికుల కోసం చేస్తున్న సాయం చూసి అనేక మంది తమకు సహాయం చేయమని సోనూ సూద్‌కి విన్నపాలు చేయడం మొదలుపెట్టారు. అయితే  తాజాగా ఓ వ్యక్తి  సోను సూద్‌కి ట్విటర్‌లో ఓ వింతైన విన్నపం చేశారు. ‘తాను ఇంట్లో ఉన్నానని, ఇంటి నుంచి మద్యం షాపు వరకు వెళ్లడానికి సాయం అందించాలి’ అని ట్విట్‌ చేశారు. ('మీ సాయం మిమ్మల్ని చూసి మరింత గర్వపడేలా చేస్తోంది')

దీనికి స్పందించిన సోన్‌ సూద్‌.. ‘మద్యం షాపు నుంచి ఇంటికి వెళ్లడానికి కూడా సాయం చేస్తాను. అయితే ఇది నీకు అవసరమైతే నాకు తెలియజేయండి’ అని దిమ్మ తిరిగిపోయే సమాధానం ఇచ్చారు. సోన్‌ సూద్‌ ఇచ్చిన సమాధానానికి నెటిజన్లు ఫిదా అయ్యారు. ప్రస్తుతం సోన్‌ సూద్‌ చేసిన ట్వీట్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ట్వీట్‌కు 39 వేల మంది లైక్‌ చేయగా, 4 వేల మంది రీట్వీట్‌ చేశారు. దిమ్మ తిరిగిపోయే విధంగా స్పందించారని నెటిజన్లు సోన్‌ సూద్‌ను మెచ్చుకుంటున్నారు.

ఇక మహారాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి  జయంత్‌ పాటిల్‌ వలస కూలీలకు చేసిన సాయానికి సోన్‌ సూద్‌ను శనిరవారం ట్విటర్‌లో ప్రశంసించారు. ‘వలస కార్మికులు వారి స్వస్థలానికి చేరుకోవడానికి సోన్‌ సూద్‌ బస్సు సౌకర్యం కల్పించారు. తనకు చేతనైన సాయం అందిచారు. సినిమా స్క్రీన్‌పై విలన్‌గా గుర్తింపు పొందిన సోన్‌ సూద్‌ నిజ జీవతంలో హీరో అయ్యారు’ అని ట్వీట్‌ చేశారు. ఇక సినిమాల విషయానికి వస్తే..  అక్షయ్‌ కుమార్‌ హీరోగా తెరకెక్కుతున్న ‘పృథ్వీరాజ్’ సినిమాలో సోన్‌ సూద్‌ కనిపించనున్నారు. ఈ సినిమాను ఆదిత్య చోప్రా నిర్మిస్తున్నారు. ఇందులో హీరోయన్‌గా మాజీ మిస్‌ వరల్డ్‌ మానుషి చిల్లర్ నటిస్తున్న విషయం తెలిసిందే. (కార్తీ బర్త్‌డే.. సోషల్‌ మీడియాలో శుభకాంక్షల వెల్లువ)