షాకింగ్: ఇయర్ ఫోన్స్ వల్ల అతడి చెవిలో..
బీజింగ్: ఇయర్ ఫోన్స్ ఎక్కువ సేపు చెవిలో పెట్టుకోకూడదన్నది నిపుణుల మాట. వీటిని అధికంగా వాడటం వల్ల వినికిడి సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. ఇక వైర్‌లెస్ ఇయర్ ఫోన్స్ వల్ల రేడియేషన్‌కు గురయ్యే ప్రమాదం ఉంది. కానీ చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు అందరికీ ఇయర్ ఫోన్స్ శరీరంలో ఒక భాగంగా మారిపోయాయి. అంతలా దానికి బానిసలయ్యారు. తాజాగా ఇయర్ ఫోన్స్ ఎక్కువగా వాడినందుకు ఓ బాలుడు ఆస్పత్రిపాలయ్యాడు. వివరాల్లోకి వెళితే.. బీజింగ్‌కు చెందిన పదేళ్ల బాలుడు చెవిలో నొప్పితో బాధపడుతున్నాడు. దీంతో అతను ఆస్పత్రికి వెళ్లగా, అతడిని పరీక్షించిన వైద్యులు షాక్‌కు గురయ్యారు. (ఇడ్లీ, దోసె, మజ్జిగ కూడా మందులే!)
చెవిలో దట్టంగా పెద్ద సమూహంలో శిలీంధ్రాలు పెరుగుతున్నట్లు గుర్తించారు. దీన్ని 'బ్లాక్ ఫారెస్ట్ ఆఫ్ ఫంగస్'గా తెలిపారు. సుదీర్ఘంగా అందిస్తున్న చికిత్స వల్ల ప్రస్తుతం అతడు పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డాడని తెలిపారు. దీనికి సంబంధించిన ఫొటోలను డా.వు యుహువా సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఇయర్ ఫోన్స్ విచ్చలవిడిగా వాడటం వల్లే ఇంత ఘోరం జరిగిందని చెప్పుకొచ్చాడు. కాబట్టి వైర్‌లెస్ ఇయర్‌ఫోన్స్, హెడ్‌ఫోన్స్ వాడకందారులు దాని పర్యవసానాలను తెలుసుకుని పరిమితంగా వినియోగించాలని హెచ్చరించారు. ఇయర్ ఫోన్స్ వినియోగదారులు ఎల్లప్పుడూ చెవిని పొడిగా ఉంచడమే కాక, దాన్ని వాడే గంటలను తగ్గించాలని సూచించారు. (పిల్లలూ... పెద్దలూ... బ్రష్ చేసుకోండిలా!)