https://www.sakshi.com/sites/default/files/styles/storypage_main/public/article_images/2020/05/25/realme%20smartv.jpg?itok=Fx3iiNae

ఆకర్షణీయ ధరల్లో రియల్‌మీ స్మార్ట్ టీవీలు



సాక్షి, ముంబై: చైనాకు  చెందిన  ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ రియల్ మీ  స్మార్ట్ టీవీ సెగ్మెంట్ లోకి ఎంట్రీ ఇచ్చింది. అనేక అంచనాలు, ఊహాగానాలు, టీజర్ల మధ్య  ఒప్పో సబ్  బ్రాండ్ రియల్‌మీ  స్మార్ట్ టీవీలను భారతదేశంలో లాంచ్ చేసింది. తద్వారా రియల్‌మీ  భారతదేశంలో తన మొదటి స్మార్ట్ టెలివిజన్‌ను ప్రారంభించింది. అలాగే బడ్జెట్ధరల స్మార్ట్ టెలివిజన్ విభాగంలోకి దూసుకొచ్చింది. పాపులర్  సైజుల్లో, బడ్జెట్ ధరల్లో ఈ స్మార్ట్ టీవీలను తీసుకొచ్చిన రియల్‌మి  తన ప్రత్యర్థులు, షావోమి, వూక్ తదితరులకు గట్టి పోటీ ఇవ్వనుంది.  ఈ టీవీలు 32, 43అంగుళాల రెండు స్క్రీన్ పరిమాణాలలో లభిస్తాయి. (కరోనా : సల్మాన్ కొత్త బ్రాండ్ లాంచ్)

రియల్‌మీ స్మార్ట్ టీవీ ధరలు 
రియల్‌మి స్మార్ట్ టీవీ 32 అంగుళాల వేరియంట్ ధర రూ. 12,999
43 అంగుళాల వేరియంట్ ధర రూ. 21, 999

లభ్యత: జూన్ 2  మధ్యాహ్నం 12 గంటల నుంచి ఫ్లిప్‌కార్ట్,  రియల్‌మే.కామ్‌లో లభ్యం. త్వరలో ఆఫ్‌లైన్ రిటైలర్ల ద్వారా కూడా లభిస్తుందని రియల్‌మి ప్రకటించింది.

https://www.sakshi.com/sites/default/files/article_images/2020/05/25/realme%20tv.jpg

రియల్‌మి స్మార్ట్ టీవీ   ఫీచర్లు
సైజు వేరియంట్‌ను బట్టి రిజల్యూషన్ ఉంటుంది. 32 అంగుళాల రియల్‌మే స్మార్ట్ టీవీ 1366x768 పిక్సెల్స్ (హెచ్‌డి-రెడీ) రిజల్యూషన్, 43 అంగుళాల వేరియంట్ 1920x1080 పిక్సెల్స్ (ఫుల్-హెచ్‌డి) రిజల్యూషన్‌ను కలిగి ఉంది.  ఆండ్రాయిడ్ టీవీ 9 పై, 1 జీబీర్యామ్, 8 జీబీ స్టోరేజ్, మీడియాటెక్ ఎంఎస్ డీ6683 ప్రాసెసర్ తో సహా మిగిలిన అన్ని ఫీచర్లు రెండింటిలో దాదాపు ఒకేలా వున్నాయి. 24 వాట్స్ సౌండ్ అవుట్‌పుట్‌తో 4- స్పీకర్ సిస్టమ్‌, డాల్బీఆడియో , బ్లూటూత్ 5.0 ఫీచర్లను కూడా జోడించింది. 

https://www.sakshi.com/sites/default/files/article_images/2020/05/25/reame%20watch.jpg

అంతేకాదు ఈ లాంచ్ ఈవెంట్‌లో రియల్‌మీ వాచ్, రియల్‌మీ బడ్స్ ఎయిర్ నియో ట్రూ వైర్‌లెస్ ఇయర్‌ఫోన్‌లను  కూడా  కంపెనీ విడుదల చేసింది. వాచ్ ధరను రూ. 3,999,  ఇయర్  ఫోన్స్  ధరను రూ. 2,999 గా ఉంచింది.

https://www.sakshi.com/sites/default/files/article_images/2020/05/25/realme%20ear%20buds.jpg