![https://www.sakshi.com/sites/default/files/styles/storypage_main/public/article_images/2020/05/25/beach.jpg?itok=ihgCHoRx https://www.sakshi.com/sites/default/files/styles/storypage_main/public/article_images/2020/05/25/beach.jpg?itok=ihgCHoRx](https://www.sakshi.com/sites/default/files/styles/storypage_main/public/article_images/2020/05/25/beach.jpg?itok=ihgCHoRx)
లాక్‌డౌన్ వేళ... విహారమేల ?
విశాఖ ,కొమ్మాది: కరోనా వైరస్ విజృంభిస్తోంది. మరో వైపు లాక్ డౌన్ కొనసాగుతుంది. అత్యవసరమైతేనే ప్రజలు బయటకు రావాలని ప్రభుత్వాలు సూచిస్తున్నాయి. ఇవన్నీ పట్టని కొంత మంది అత్యుత్సాహం చూపిస్తున్నారు. ఆహ్లాదం కోసం నిబంధనలను పట్టించుకోకుండా బీచ్‌ల వద్ద గుంపులు గుంపులుగా తిరుగుతున్నారు. వీటికి సాక్ష్యమే మంగమారిపేట బీచ్ వద్ద ఆదివారం కనిపించిన పర్యాటకుల తాకిడి. ప్రస్తుతం లాక్‌డౌన్ నేపథ్యంలో నగరంలో పర్యాటక ప్రాంతాలు, బీచ్‌లు, పార్కులు అన్నీ మూతపడ్డాయి.
![https://www.sakshi.com/sites/default/files/article_images/2020/05/25/vsp2.jpg https://www.sakshi.com/sites/default/files/article_images/2020/05/25/vsp2.jpg](https://www.sakshi.com/sites/default/files/article_images/2020/05/25/vsp2.jpg)
దీంతో తీర ప్రాంతమైన మంగమారిపేట తీరానికి ఆదివారం వందలాది మంది ఒక్కసారిగా చేరుకున్నారు. ప్రధాన రహదారికి ఇరువైపులా కార్లు, ద్విచక్ర వాహనాలు పార్కింగు చేశారు. ఇది తెలుసుకున్న స్థానికులు పోలీసులు బీచ్ వద్దకు చేరుకుని పర్యాటకులను వెనక్కి పంపించారు. లాక్ డౌన్ ఉన్నంతవరకు బీచ్‌ల వద్దకు పర్యాటకులకు అనుమతి లేదని గ్రహించాలని పోలీసులు తెలిపారు.
![https://www.sakshi.com/sites/default/files/article_images/2020/05/25/vsp.jpg https://www.sakshi.com/sites/default/files/article_images/2020/05/25/vsp.jpg](https://www.sakshi.com/sites/default/files/article_images/2020/05/25/vsp.jpg)
మంగమారిపేట బీచ్ వద్ద పర్యాటకులను వెనక్కి పంపిస్తున్న పోలీసులు