ముద్దు పెట్టుకున్నారు.. అరెస్టు చేశారు
ఎత్తైన భవనంపై బహిరంగంగా ముద్దు పెట్టుకున్న ఓ పార్కుర్ అథ్లెట్‌ను పోలీసులు అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళితే.. గత వారం ఇరాన్‌కు చెందిన పార్కుర్ అథ్లెట్ అలిరేజా జపాలాఘీ, తన స్టంట్ భాగస్వామిని ఇంటి పైన ముద్దు పెట్టుకున్నారు. ఈ ఫోటోలను తన ఫేస్‌బుక్‌లో షేర్ చేయడంతో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. దీంతో ఇరాన్ సంప్రదాయాలు, ఆచారాలకు విరుద్ధంగా వ్యవహరించిన అతడిని టెహ్రాన్ పోలీసులు గురువారం అరెస్టు చేశారు. (ఆ ఆరోపణలు అర్థం లేనివి : చైనా )
గత వారం తనకు గుర్తు తెలియని వ్యక్తుల నుంచి కాల్స్ వచ్చాయని, స్వతహాగా లొంగకపోతే పబ్లిక్‌గా అరెస్టు చేస్తామని బెదిరించినట్లు జపాలాఘీ ఇన్‌స్టాగ్రామ్ లైవ్‌లో మాట్లాడుతూ తెలిపారు. కాగా జపాలాఘీని పోలీసులు అరెస్టు చేసినప్పటికీ ఫోటోలో మహిళ ముఖం సరిగా తెలియకపోవడంతో ఆమె కోసం పోలీసులు గాలిస్తున్నారు. అయితే వీరి నిర్బంధాన్ని సోషల్ మీడియాలో నెటిజన్లు తీవ్రంగా విమర్శిస్తున్నారు. పార్కుర్ అథ్లెట్‌కు మద్దతుగా పలువురు అక్రోబాటిక్ విన్యాసాలను ప్రదర్శిస్తున్నారు. (తొందరెందుకు.. కాస్త ఆగి చూడండి: మిస్బా )
ఇస్లామిక్ వస్త్రధారణ నియమాల ప్రకారం ఇంటి నుంచి బయటకు వచ్చిన మహిళలు తమ ముఖం, చేతులు, కాళ్లను మాత్రమే కనబడేలా దుస్తులు వేసుకోవాలి. అలాగే ఎలాంటి ఆర్భాటాలు లేని రంగులను మాత్రమే ధరించాలి. అయితే ఇలాంటి మంచి పని చేసిన వారికి బహుమతి ఇవ్వాలి కానీ అరెస్టు చేయకూడదని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ఎలాంటి సహాయం లేకుండా వేగంగా ఒక ప్రదేశం నుంచి మరో ప్రదేశానికి జంప్ చేసేవారిని పార్కుర్ అథ్లెట్ అంటారు. పార్కుర్‌లో రన్నింగ్, క్లైంబింగ్, స్వింగింగ్, జంపింగ్ రోలింగ్ వంటివి ఉంటాయి. (రెడ్ అలర్ట్: ఆ సమయంలో బయటకు రావొద్దు )