https://www.sakshi.com/sites/default/files/styles/storypage_main/public/article_images/2020/05/25/migrany%20labour.jpg?itok=i8JPFGoz

‘నీ తండ్రి ఏం ఉద్యోగం ఇచ్చాడు’

పట్నా: బిహార్‌ షెయిక్‌పూర్‌ నియోజకవర్గ జేడీయూ ఎమ్మెల్యే రంధీర్‌ కుమార్‌ సోనికి ఓ చేదు అనుభవం ఎదురయ్యింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో తెగ వైరలవుతోంది. ఈ వీడియోను మే 22న తీశారు. రంధీర్‌ కుమార్‌ షెయిక్‌పూర్‌లోని చండి గ్రామంలో ఏర్పాటు చేసిన ఓ క్వారంటైన్‌ కేంద్రాన్ని సందర్శించారు. ఈ క్రమంలో అక్కడ ఉన్న వలస కార్మికులు ఉద్యోగాలు, మౌళిక వసతుల గురించి ఎమ్మెల్యేను ప్రశ్నించారు. కేంద్రం, రాష్ట్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం తగినన్ని ఉద్యోగాలు కల్పించడంలో ఎందుకు వెనకబడడ్డాయి అంటూ వలస కూలీలు రంధీర్‌ కుమార్‌ను ప్రశ్నించారు. (‘ఆ బస్సులను ఆపకండి’)

దానికి సదరు ఎమ్మెల్యే ‘మీ తండ్రి నీకు ఒక్క ఉదద్యోగం అయినా ఇచ్చారా’ అంటూ వలస కూలీని ప్రశ్నించారు. దాంతో వలస కూలీలకు, ఎమ్మెల్యేకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. పరిసస్థితి చేయి దాటడంతో రంధీర్‌ అక్కడి నుంచి మరో క్వారంటైన్‌ కేంద్రానికి వెళ్లారు. అయితే రంధీర్‌ వ్యాఖ్యలపై ప్రతిపక్ష నాయకుడు తేజస్వీ యాదవ్‌ మండిపడడ్డారు. ఎమ్మెల్యే అసంబద్ధ వ్యాఖ్యలు చేశారని తేజస్వీ ఆగ్రహం వ్యక్తం చేశారు. (క్వారంటైన్‌లో కోడికూర ఇవ్వలేదని..)